పుణె: సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో హైదరాబాద్ వరుస విజయాలతో దూసుకెళుతున్నది. తమ తొలి మ్యాచ్‌లో ముంబైని చిత్తు చేసిన హైదరాబాద్ మలిపోరులో రాజస్థాన్ భరతం పట్టింది. ఆదివారం జరిగిన పోరులో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో రాజస్థాన్‌పై ఘన విజయం సాధించింది. చామా మిలింద్(3/25), తనయ్ త్యాగరాజన్(3/38) ధాటికి రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 178/9 స్కోరు చేసింది.
మహిపాల్ లామ్రోర్(48) మినహా ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన హైదరాబాద్..తన్మయ్ అగర్వాల్(41 బంతుల్లో 73, 8ఫోర్లు, 3సిక్స్‌లు) ధనాధన్ అర్ధసెంచరీకి తోడు రాహుల్ బుద్ది(55) రాణించడంతో 17.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. టోర్నీలో సూపర్ ఫామ్‌మీదున్న తన్మయ్..రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కమలేశ్, మానవ్‌కు రెండేసి వికెట్లు దక్కాయి.