నాదౌన్: ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో హైదరాబాద్ ఎట్టకేలకు మూడో మ్యాచ్‌లో బోణీ కొట్టింది. ఎలైట్ గ్రూప్ డీలో ఆ జట్టు.. హిమాచల్ ప్రదేశ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. రెండో ఇన్నింగ్స్‌లో హిమాచల్ నిర్దేశించిన 344 పరుగుల ఛేదనలో ఆఖరి రోజు.. ఓపెనర్ అభిరాత్ రెడ్డి (200 బంతుల్లో 175 నాటౌట్, 19 ఫోర్లు, 3 సిక్సర్లు) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయాడు.
అతడికి అండగా రాహుల్ (66), హిమతేజ (33) రాణించడంతో హైదరాబాద్ ఈ సీజన్లో తొలి విజయాన్ని నమోదుచేసింది. ఈ గెలుపుతో గ్రూప్-డీ పాయింట్ల పట్టికలో హైదరాబాద్ 10 పాయింట్లతో ముంబై (12 పాయింట్లు) తర్వాత రెండో స్థానంలో నిలిచింది.