Japan Open | క్వార్టర్స్‌లో ప్రణయ్ ఓటమి.. జపాన్ ఓపెన్‌లో ముగిసిన భారత్ పోరు
ఒసాకా వేదికగా జరుగుతున్న జపాన్ ఓపెన్‌లో భారత పోరాటం ముగిసింది. భారత్ ఎన్నో ఆశలు పెట్టుకున్న స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్.. క్వార్టర్స్‌లో నిష్క్రమించాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-750 పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో ప్రణయ్.. 17-21, 21-15, 20-22 తేడాతో చైనీస్ తైఫీకి చెందిన చౌ టియెన్ చెన్ చేతిలో ఓడాడు. దీంతో ఈ టోర్నీలో భారత్ పోరాటం ముగిసినట్టైంది.
జపాన్ ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, లక్ష్యసేన్‌లు తొలి రౌండ్లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. తొలి రౌండ్ నెగ్గిన కిదాంబి శ్రీకాంత్.. ప్రిక్వార్టర్స్‌లో ఓటమిపాలయ్యాడు. దీంతో ఆశలన్నీ ప్రణయ్ మీదే పెట్టుకున్నారు భారత బ్యాడ్మింటన్ అభిమానులు.
కానీ ప్రణయ్ మాత్రం.. తొలి సెట్ ఓడినా కుదురుకుని రెండో సెట్ నెగ్గాడు. చివరి సెట్ లో మళ్లీ పట్టుకోల్పోయాడు. దీంతో టియెన్ చెన్ విజయం సాధించాడు. ప్రణయ్.. తొలి రౌండ్లో మలేషియా ఆటగాడు అంగుస్ను ఓడించాడు. ప్రిక్వార్టర్స్‌లో సింగపూర్ ఆటగాడు లోహ్ కిన్ యే (సింగపూర్)పై విజయం సాధించాడు.
A thrilling match between HS Prannoy & Chou Tien Chen! The Indian fought back from 5-11 down in the decider & even saved 3 match points but it wasn’t to be. A fine performance by CTC to get his first win over Prannoy this year & reach the semis.#JapanOpenSuper750 #JapanOpen2022 pic.twitter.com/bCNtpKdjsy
— Aditya Chaturvedi (@aditya_c19) September 2, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

