వడోదర: వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఫీడర్ సిరీస్లో భారత ప్యాడ్లర్లు దివ్యాన్షి భౌమిక్, అనుష్క క్వార్టర్స్ చేరుకున్నారు. మహిళల ప్రిక్వార్టర్స్ మ్యాచ్లలో ఈ ఇద్దరూ తమ ప్రత్యర్థులను ఓడించారు.
దివ్యాన్షి.. 3-1 (8-11, 11-9, 11-9, 13-11)తో కొరియాకు చెందిన పార్క్ గహ్యోన్ను చిత్తుచేసింది. మరో పోరులో అనూష.. 3-0 (11-6, 11-6, 11-9)తో ఆరో సీడ్ లి జియోన్ను ఓడించింది.