SL vs BAN : ఆసియా కప్ రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ (Bangladesh) టాపార్డర్ కుప్పకూలింది. శ్రీలంక పేసర్ల విజృంభణతో ఓపెనర్లు డకౌట్ అవ్వడంతో మిడిలార్డర్ బ్యాటర్లు జట్టును ఆదుకున్నారు. 38కే నాలుగు వికెట్లు పడిన దశలో షమీమ్ హొసేన్(42 నాటౌట్), జకీర్ అలీ(41 నాటౌట్)లు క్రీజులో పాతుకపోయి ఏడో వికెట్‌కు 81 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. దాంతో, బంగ్లా ప్రత్యర్థికి 140 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు ఆదిలోనే షాకిచ్చారు లంక పేసర్లు. ఓపెనర్లు తంజిద్ హసన్(0)ను తుషార బౌల్డ్ చేయగా.. పర్వేజ్ హొసేన్(0)ను చమీర వెనక్కి పంపాడు. సున్నాకే రెండు వికెట్లు కోల్పోయిన జట్టును కెప్టెన్ లిటన్ దాస్(28), తౌహిద్ హ్రిదోయ్(9)లు ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ, హసరంగ ఓవర్లో లిటన్ దొరికిపోగా.. కమిల్ మిషరా మెరుపు త్రోకు తౌహిద్ రనౌట్‌గా వెనుదిరిగాడు. అంతే.. 38కే నాలుగు కీలక వికెట్లు పడడంతో వందలోపే బంగ్లా ఇన్నింగ్స్ ముగిసేలా కనిపించింది.
From 53-5 to this 🤝#AsiaCup2025 LIVE ⏩ https://t.co/3X9o1nkWFw pic.twitter.com/zldMkz3FjX
— ESPNcricinfo (@ESPNcricinfo) September 13, 2025
కానీ, ఆ దశలో షమీమ్ హొసేన్(42 నాటౌట్), జకీర్ అలీ(41నాటౌట్)లు ఆచితూచి ఆడారు. కాస్త నిలదొక్కుకున్నాక గేర్ మార్చిన ఇద్దరూ డెత్ ఓవర్లలో బౌండరీలతో చెలరేగారు. చివరి రెండు ఓవర్లలో 26 రన్స్ పిండుకుంది ఈ జోడీ. హొసేన్, జకీర్‌లు ఆరో వికెట్‌కు అజేయంగా 81 పరుగులు రాబట్టడంతో.. బంగ్లా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేయగలిగింది.