Badminton | హాంకాంగ్: భారత బ్యాడ్మింటన్ మహిళల డబుల్స్ జోడీ త్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్.. హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ప్రిక్వార్టర్స్‌లో ఓటమిపాలైంది. ప్రిక్వార్టర్స్‌లో భారత జోడీ.. 11-21, 20-22తో లియు షెంగ్ – టాన్ నింగ్(చైనా) చేతిలో ఓడింది. తొలి గేమ్‌లో ప్రత్యర్థి దూకుడుకు చిత్తైన మన అమ్మాయిలు.. రెండో గేమ్‌లో హోరాహోరీగా పోరాడినా ఫలితం వారికి అనుకూలంగా రాలేదు.