ఢిల్లీ: హైదరాబాద్ మహానగరం మరో ప్రతిష్టాత్మక క్రీడాటోర్నీకి వేదిక కాబోతున్నది. వచ్చే ఏడాది మార్చిలో జరుగబోయే ఎఫ్ఐహెచ్ ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌కు హైదరాబాద్ ఆతిథ్యమివ్వబోతున్నది. మార్చి 8 నుంచి 14 దాకా ఈ టోర్నీ జరగాల్సి ఉంది.
రెండో అంచెలో భాగంగా ఆతిథ్య భారత్‌తో పాటు ఇంగ్లండ్, స్కాట్లాం డ్, కొరియా, ఇటలీ, ఉరుగ్వే, వేల్స్, ఆస్ట్రి యా మ్యాచ్‌లు ఆడనున్నాయి. హైదరాబాద్ కంటే ముందే శాంటిగో (చిలీ)లో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 8 దాకా తొలి అంచె పోటీలు జరుగుతాయి.