World Cup 2023 | వన్డే ప్రపంచ కప్-2023 (World Cup 2023)లో భాగంగా ఆస్ట్రేలియా – శ్రీలంక (AUS vs SL) జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియంలోని ఓ హోర్డింగ్ హఠాత్తుగా విరిగిపడింది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలకూ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
లక్నో (Luckno)లోకి ఎకానా స్టేడియంలో (Ekana Stadium) సోమవారం ఆస్ట్రేలియా – శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఆ సమయంలో అక్కడ వర్షం పడింది. వర్షం తగ్గిన తర్వాత భారీగా గాలులు వీచాయి. దీంతో ఎకానా స్టేడియం పైకప్పులో ఏర్పాటు చేసిన ప్రచార హోర్డింగ్ ఒక్కసారిగా కూలిపోయింది (Hoardings Fall ). దీంతో స్టేడియంలోని అభిమానులు, ఆటగాళ్లంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనతో కింది వరుసలో కూర్చున్న ప్రేక్షకుల్ని నిర్వాహకులు పైస్టాండ్స్కి పంపించారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Scary scenes at Ekana Stadium, Lucknow.
Hoardings are falling and fans running for cover. #AUSvSL #AUSvsSL
🎥/Atnomani pic.twitter.com/7kwVsSbMn0— Ishan Joshi (@ishanjoshii) October 16, 2023
#AUSvSL stadium going apart in lucknow by wind only pic.twitter.com/fr3YrDCdvc
— Darksideraza (@Darksiderazaa) October 16, 2023
CWC 2023: Hoardings fall in crowd due to strong wind in Lucknow stadium during AUS vs SL clash
The match was halted due to rain and strong winds during the first innings. pic.twitter.com/icsiKGMtXI
— CrickologyNews (@CrickologyNews) October 16, 2023
Also Read..
David Warner: వివాదాస్పద ఎల్బీడబ్ల్యూ.. డేవిడ్ వార్నర్ ఆగ్రహం.. వీడియో
Allu Arjun | చిన్నారి అభిమానితో అల్లు అర్జున్ స్పెషల్ మూమెంట్స్.. వీడియో