లక్నో: ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్(David Warner).. వివాదాస్పద రీతిలో ఔటయ్యారు. శ్రీలంకతో జరిగిన వన్డేలో అతను ఎల్బీడబ్ల్యూ ఔటయ్యాడు. మధుశంక వేసిన బౌలింగ్‌లో .. లెగ్‌సైడ్ వెళ్తున్న బంతి వార్నర్ ప్యాడ్స్‌కు తగిలింది. దీంతో అంపైర్ జోయల్ విల్సన్ అతన్ని ఔట్‌గా ప్రకటించాడు. బంతి చాలా ఎత్తులో వెళ్తూ.. వార్నర్ ప్యాడ్స్‌ను ఢీకొట్టింది. ఆన్‌సైడ్ షాట్ కొట్టాలని ప్రయత్నించిన వార్నర్ మిస్సయ్యాడు. బౌలర్ అపీల్ చేయడంతో.. అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. అయితే అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వార్నర్ డీఆర్ఎస్ తీసుకున్నాడు. కానీ డీఆర్ఎస్లో అంపైర్స్ కాల్ కరెక్ట్ అని తేలింది. అంపైర్స్ కాల్‌ను సమర్ధించడంతో.. ఆస్ట్రేలియా బ్యాటర్ అసహనంతో వెనుదిరిగాడు. ఎట్టికేలకు ఆస్ట్రేలియా అయిదు వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయం నమోదు చేసి ఈ వరల్డ్‌కప్‌లో పాయింట్ల ఖాతాను తెరిచింది.