CWC | ధర్మశాల: అంచనాలు లేకుండా వన్డే ప్రపంచకప్‌లో అడుగుపెట్టి.. దుమ్మురేపుతున్న దక్షిణాఫ్రికా మూడో పోరుకు సిద్ధమైంది. తమ తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై రికార్డు స్కోరు చేసిన సఫారీలు.. రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను చిత్తు చేశారు. ఇక మంగళవారం ధర్మశాలలో నెదర్లాండ్స్‌తో ప్రొటీస్ పోటీ పడనున్నారు.
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ఏ రంగంలో చూసుకున్నా.. నెదర్లాండ్స్ కన్నా దక్షిణాఫ్రికా ఎన్నో రెట్లు ముందున్నా.. డచ్ జట్టును తక్కువ అంచనా వేసేందుకు లేదు. అసలే డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌కు అఫ్గాన్ షాకివ్వడంతో మెగాటోర్నీలో అతిపెద్ద సంచలనం నమోదు కాగా.. ఇలాంటి ప్రదర్శనే కనబర్చాలని నెదర్లాండ్స్ కూడా పరితపిస్తున్నది. డికాక్, బవుమా, డసెన్, మార్క్మ్,్ర మిల్లర్, క్లాసెన్‌తో కూడిన బ్యాటింగ్ లైనప్‌ను నిలువరించడం నెదర్లాండ్స్‌కు శక్తికి మించిన పనే.