న్యూఢిల్లీ: భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా భార్య హిమానీ మోర్ మంచి ఆఫర్‌ను వదులుకుంది. ఫ్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్ అయిన హిమానీ..అమెరికా కంపెనీ కోటిన్నర రూపాయల ఉద్యోగాన్ని తిరస్కరించింది. ఈ విషయాన్ని ఆమె తండ్రి చాంద్ మోర్ జాతీయ వార్తాసంస్థతో పేర్కొన్నాడు. ‘నీరజ్‌తో పెండ్లి తర్వాత టెన్నిస్ కెరీర్‌కు వీడ్కోలు పలికిన హిమానీ..అమెరికా కంపెనీ ఇచ్చిన స్పోర్ట్స్ సంబంధిత జాబ్ అవకాశాన్ని కూడా వదులుకుంది. వీటన్నింటికీ భిన్నంగా సొంతంగా బిజినెస్‌ను ప్రారంభించడంపై ఆమె దృష్టి పెట్టింది’ అని పేర్కొన్నాడు. ఢిల్లీ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ చదివిన హిమానీ..ఫ్రాంక్లిన్ పీయర్స్ యూనివర్సిటీ నుంచి స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ మేనేజ్మెంట్లో పట్టా పొందింది. నీరజ్‌తో కలిసి ప్రస్తుతం యూరప్‌లో ఉన్న హిమానీ త్వరలో వ్యాపారంలోకి అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి.