IND vs SA 1st Test : ఈడెన్ గార్డెన్స్‌లో జతొలి టెస్టులో భారత్ పట్టుబిగించింది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(4-29) స్పిన్ మ్యాజిక్‌తో దక్షిణాఫ్రికా బ్యాటర్లు తోకముడవగా మ్యాచ్ టీమిండియా గుప్పిట్లోకి వచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప ఆధిక్యమే వచ్చినా.. స్పిన్ ద్వయం కుల్దీప్, జడ్డూలు తిప్పేయడంతో రెండో ఇన్నిగ్స్లోనూ పర్యాటక జట్టు ఆలౌట్ ప్రమాదంలో పడింది. ప్రధాన ఆటగాళ్లు చేతులెత్తేయగా కెప్టెన్ తెంబ బవుమా(29 నాటౌట్) పోరాడుతున్నాడు. రెండోరోజు మ్యాచ్‌ను శాసించిన భారత్ మూడో రోజే జయభేరి మోగించడం ఖాయం.
సొంతగడ్డపై మరో టెస్టు సిరీస్‌లోనూ భారత జట్టు గెలుపు వాకిట నిలిచింది. ఈడెన్ గార్డెన్స్‌లో స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో.. బౌలర్ల జోరుతో టీమిండియా పట్టుబిగించింది. ఓవర్ నైట్ స్కోర్ 37/1తో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్‌ను.. లెగ్ స్పిన్నర్ హర్మాన్(4-30) దెబ్బకొట్టాడు. అతడి విజృంభణతో ప్రధాన ఆటగాళ్లు పెవిలియన్ చేరగా.. దక్షిణాఫ్రికాకు 30 పరుగుల ఆధిక్యం లభించింది. దాంతో.. రెండో ఇన్నింగ్స్‌లో గొప్పగా ఆడి మ్యాచ్‌లో నిలవాలనుకున్న సఫారీలకు రవీంద్ర జడేజా(4-29) దిమ్మదిరిగే షాకిచ్చాడు. అతడికి చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్(2-12) కూడా తోడవ్వగా పర్యాటక జట్టు కష్టాలు రెట్టింపయ్యాయి.
A massive impact yet again! ☝️☝️
🎥 Ravindra Jadeja on fire in the second innings with a double-wicket over! 🔥
Updates ▶️ https://t.co/okTBo3qxVH #TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank | @imjadeja pic.twitter.com/f12j1dMOIX
— BCCI (@BCCI) November 15, 2025
మార్కో యాన్సెన్ జతగా తెంబా బవుమా(29 నాటౌట్) కాసేపు ప్రతిఘటించారు. కానీ, కుల్దీప్ ఓవర్లో పెద్ద షాట్‌కు యత్నించిన యాన్సెన్ స్లిప్‌లో రాహుల్ చేతికి చిక్కాడు. దాంతో.. ఏడో వికెట్ కోల్పోయిన సఫారీ టీమ్ ఆలౌట్ అంచున నిలిచింది. అయితే.. వెలుతురు లేమి కారణంగా మరో పది ఓవర్లకు ముందు ఆటను నిలిపివేశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. ఓపెనర్లు రియాన్ రికెల్టన్(23) ఎడెన్ మర్క్రమ్(31)లు ధనాధన్ ఆడుతూ భారత్‌పై ఒత్తిడి పెంచాలనుకున్నారు. తొలి వికెట్‌కు 57 రన్స్ జోడించిన ఈ ద్వయాన్ని జస్ప్రీత్ బుమ్రా విడదీసి వికెట్ల వేటకు తెరతీశాడు. మొదట రికెల్టన్ను బౌల్డ్ చేసిన యార్కర్ కింగ్ ఆ తర్వాత.. మర్క్రమ్ను పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత కెప్టెన్ తెంబా బవుమా(3)ను కుల్దీప్ యాదవ్ బోల్తా కొట్టించాడు. 82కే మూడు వికెట్ల పడిన వేళ.. కుర్రాళ్లు టోనీ బ్రిట్జ్(24), ట్రిస్టన్ స్టబ్స్(15 నాటౌట్) సఫారీ టీమ్‌ను ఆదుకున్నారు. వీరిద్దరూ కీలక రన్స్ జోడించి స్కోర్ వంద దాటించారు. అయితే.. ఈ జోడీని విడదీసిన బుమ్రా.. ఆ తర్వాత మరో రెండు వికెట్లు తీసి దక్షిణాఫ్రికా పతనాన్ని శాంసించాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా టెయిలెండర్ల సాయంతో స్టబ్స్ జట్టు స్కోర్ రెండొందలు దాటించాలనుకున్నాడు. కానీ.. హర్మర్, కేశవ్ మహరాజ్(0)లను ఔట్ చేసిన బుమ్రా 159కేసఫారీల ఇన్నింగ్స్ ముగించాడు.
Kuldeep Yadav strikes for #TeamIndia on the stroke of Tea on Day 2! ☝️🫖
He traps Ryan Rickelton plumb in front 👍
Scorecard ▶️ https://t.co/okTBo3qxVH #INDvSA | @IDFCFIRSTBank | @imkuldeep18 pic.twitter.com/bdX3NYTVeX
— BCCI (@BCCI) November 15, 2025