చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో రెండ్రోజుల క్రితం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా విజయం సాధించింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలుపొంది గతేడాది టీ20 ప్రపంచకప్‌లో పాక్ చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది. అయితే ఇప్పుడు ఈ జట్లు మరోసారి తలపడబోతున్నాయి. వచ్చే ఆదివారం ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ మళ్లీ చూడొచ్చు.
గ్రూప్-ఏలో ఉన్న భారత్, పాకిస్తాన్, హాంకాంగ్ లు గ్రూప్ దశలో ఒక్కో మ్యాచ్ ఆడతాయి. ఇప్పటికే భారత్, పాక్‌ల మధ్య ముగిసిన మ్యాచ్‌లో రోహిత్ సేన నెగ్గింది. ఆగస్టు 31న టీమిండియా.. హాంకాంగ్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ తర్వాత సెప్టెంబర్ 2న పాకిస్తాన్.. హాంకాంగ్‌తో ఆడనుంది. ఆ తర్వాత సూపర్-4 జరగాల్సి ఉంది.
ఏదైనా అద్భుతం జరిగితే తప్ప హాంకాంగ్.. భారత్, పాక్‌లను ఓడించడం కష్టమే. దీని ప్రకారం సూపర్ -4లో మళ్లీ ఈ రెండు జట్లు తలపడబోతున్నాయి. మెగా టోర్నీ నిబంధనల ప్రకారం.. గ్రూప్ స్టేజ్‌లో ఒక్కో మ్యాచ్ ఆడిన ఇరు జట్లు.. సూపర్-4లో తమ గ్రూప్‌లోని జట్టుతో పాటు ఇతర గ్రూప్‌లోని రెండు జట్ల (బీ1, బీ2) తో ఒక్కో మ్యాచ్ ఆడతాయి. దాని ప్రకారం (ఏ1 వర్సెస్ ఏ2) మ్యాచ్ సెప్టెంబర్ 4న ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది.
ఇక సూపర్-4 తర్వాత కూడా దాయాది దేశాలు మరోసారి తలపడే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రెండు జట్ల ఫామ్‌ను బట్టి చూస్తే భారత్, పాక్ ఫైనల్ చేరడం పెద్ద కష్టమేమీ కాదు. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప సెప్టెంబర్ 11న ఆసియా కప్ ఫైనల్లో మరోసారి భారత్-పాక్ పోరును అభిమానులు వీక్షించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
Tickets🎟for Asia Cup 🏆2022 go up for sale on August 15th 🗓 Visit the link below from Monday onwards to book your tickets:https://t.co/BjfeZVCIxi pic.twitter.com/Q8y9mwj6Z5
— AsianCricketCouncil (@ACCMedia1) August 13, 2022