మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ను ఓటమితో ప్రారంభించిన భారత జట్టు ప్రదర్శనపై హెడ్కోచ్ గౌతం గంభీర్ అసంతృప్తిగా ఉన్నాడా? మెల్బోర్న ఓటమి తర్వాత అతడు టీ20 కెప్టెన్ సూర్యతో వాగ్వాదానికి దిగాడా? తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఓ వీడియోను బట్టి చూస్తే ఇది నిజమనిపించక మానదు.
మెల్బోర్న్లో ఓటమి తర్వాత గంభీర్.. జట్టు ప్రదర్శనపై తీవ్ర అసహనం వ్యక్తం చేయగా సూర్య నిస్తేజంగా వివరణ ఇచ్చేందుకు యత్నిస్తున్న వీడియో నెట్లో చక్కర్లు కొడుతున్నది.