హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధికి బీసీసీఐ సహకరించాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్రావు..బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియాను కోరారు. శనివారం ముంబైలోని బీసీసీఐ కార్యాలయంలో దేవజిత్తో పాటు సీఈవో హేమాంగ్ అమిన్‌తో జగన్, హెచ్‌సీఏ కోశాధికారి సీజే శ్రీనివాస్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా ల్లో కొత్తగా నిర్మించే స్టేడియాలు, మౌలిక సదుపాయాల కల్పనకు బోర్డు తోడ్పాటు అందించాలని జగన్ విజ్ఞప్తి చేయగా, అందుకు దేవజిత్ సానుకూలంగా స్పం దించారు. హెచ్‌సీఏ చేపట్టే అభివృద్ధి పనులకు 50శాతం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో క్రికెట్‌కు ఉన్న ఆదరణ దృష్ట్యా ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లతో పాటు ప్లేఆఫ్స్ కేటాయించాలని కోరారు.