హైదరాబాద్, ఆట ప్రతినిధి నవంబర్ 5: విజయ్ హజారే టోర్నీలో బరిలోకి దిగనున్న హైదరాబాద్ జట్టును హెచ్సీఏ శనివారం ప్రకటించింది. 19 మందితో కూడిన జట్టుకు ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. తిలక్ వర్మ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు.
ఈ జట్టులో రోహిత్ రాయుడు, రాహుల్, రవితేజ, తనయ్ త్యాగరాజన్, రక్షణ్ రెడ్డి, మికిలి జైస్వాల్, అభిరత్ రెడ్డి, మీర్ జావీద్ అలీ, రిషిత్ రెడ్డి, అలంకృత్ అగర్వాల్, భరత్ వర్మ, అనికేత్ రెడ్డి, ధీరజ్ గౌడ్, సంకేత్, భవేష్ సేథ్, సమిత్ రెడ్డి, సంతోష్ గౌడ్ చోటు దక్కించుకున్నారు. ఈ నెల 12 నుంచి ఢిల్లీ వేదికగా దేశవాళీ వన్డే టోర్నీ ప్రారంభం కానుండగా.. హైదరాబాద్ తొలి మ్యాచ్లో హిమాచల్ ప్రదేశ్తో తలపడనుంది.