అడిలైడ్ : భారత్‌తో రెండో టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పెర్త్ టెస్టులో భారీ ఓటమి మూ టగట్టుకున్న ఆసీస్ టీమ్‌కు స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ దూరమయ్యాడు. ఈనెల 6 నుం చి అడిలైడ్‌లో మొదలయ్యే డే అండ్ నైట్ టెస్టు నుంచి గాయం కారణంగా వైదొలిగినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. గాయపడ్డ హాజిల్‌వుడ్ జట్టుతో కొనసాగుతాడని పేర్కొన్న సీఏ.. అత ని స్థానంలో సీన్ అబాట్, డగెట్ను జట్టుకు ఎంపిక చేసింది. పింక్‌బాల్ టెస్టుల్లో హాజిల్‌వుడ్‌కు మంచి రికార్డు ఉంది. గతంలో అడిలైడ్ టెస్టులో భారత్‌ను 36కే ఆలౌట్ చేయడంతో హాజిల్‌వుడ్ కీలకమయ్యాడు.