Harshit Rana : వన్డే ఫార్మాట్లో భారత జట్టుకు ఆల్‌రౌండర్ కొరత తీరేలా కనిపిస్తోంది. ఇటీవల కాలంలో పేసర్ హర్షిత్ రానా (Harshit Rana )సంచలన ఆటతో నేను రెఢీ అని చాటుకుంటున్నాడు. తనపై ‘గంభీర్ శిష్యుడు’ అనే ముద్ర వేసిన విమర్శకులకు మైదానంలో జట్టును గెలిపించే ప్రదర్శనతోనే బదులిస్తున్నాడీ స్పీడ్‌స్టర్. మ్యాచ్ మ్యాచ్‌కు రాటుదేలుతున్న ఈ పొడగరి పేసర్.. వడోదర వన్డేలో ఖతర్నాక్ ఇన్నింగ్స్‌తో టీమిండియా విజయంలో కీలకమయ్యాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ మేనేజ్మెంట్ ‘నన్ను వన్డేల్లో ఆల్‌రౌండర్‌గా చూడాలనుకుంటోంది’ అని వెల్లడించాడు.
టీమిండియా కోచ్‌గా గౌతం గంభీర్ రావడమే ఆలస్యం కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు సభ్యులకు పెద్ద పీట వేశాడు. పేసర్ హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తిలు భారత జెర్సీ వేసుకున్నారు. వరుణ్ టీ20లకే పరిమితమవ్వగా.. హర్షిత్ మాత్రం ఫొట్టి ఫార్మాట్‌తో పాటు టెస్టులు, వన్డేల్లోనూ పాతుకుపోతున్నాడు. ‘మేనేజ్మెంట్ ఎందుకు రానాకు ఇన్ని అవకాశాలు ఇస్తోంది?’ అనే ప్రశ్నకు తన ఆటతోనే సమాధానం చెబుతున్నాడీ పేసర్.
Rage Rana is back at it! 💪#HarshitRana returns for his second spell and sends the openers back to the pavilion! 🇮🇳👏#INDvNZ, 1st ODI LIVE NOW 👉 https://t.co/WbMZTXL0By pic.twitter.com/U33zmfTdfQ
— Star Sports (@StarSportsIndia) January 11, 2026
న్యూజిలాండ్‌తో తొలి వన్డేకు ఫామ్‌లో ఉన్న అర్ష్‌దీప్ సింగ్‌ను కాదని హర్షిత్‌ను తుది జట్టులోకి తీసుకోవడంపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. దాంతో.. న్యూజిలాండ్ ఓపెనర్లను ఔట్ చేసి బ్రేకిచ్చిన ఈ పేస్ గన్.. కాస్త అగ్రెస్సివ్గానే సెలబ్రేట్ చేసుకున్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ తనను టీమ్ మేనేజ్మెంట్ వన్డేల్లో ఆల్‌రౌండర్‌గా చూడాలనుకుంటోంది అని చెప్పాడు.
🗣️ Harshit Rana- “Team management wants me to groom as an all-rounder. I am working on that in the nets as well.” pic.twitter.com/V9Z4zUvp8u
— Rokte Amar KKR (@Rokte_Amarr_KKR) January 12, 2026
‘భారత మేనేజ్మెంట్ నన్ను వన్డేల్లో ఆల్‌రౌండర్‌గా ఉపయోగించుకోవాలని అనుకుంటోంది. నేను కూడా మెరుగయ్యేందుకు కష్టపడుతున్నా. నెట్స్‌లో కూడా బ్యాటింగ్ మీద ఎక్కువే దృష్టి పెడుతున్నా. ఆల్‌రౌండర్‌గా రాణించాలంటే అన్నికంటే ముఖ్యమైంది ఆత్మవిశ్వాసంగా ఉండడం. సహచరులు నాలో కల్పించిన ఆత్మవిశ్వాసం నాకు ఎంతో ఉపయోగపడింది. జట్టులో నా పాత్ర ఏంటో నాకు తెలుసు. అందుకే క్రీజులోకి వెళ్లడమే ఆలస్యం పరుగులు చేసేందుకు ప్రయత్నిస్తాను. బ్యాటింగ్ విషయానికొస్తే నన్ను ఎనిమిదో స్థానంలో ఆల్‌రౌండర్‌గా పంపిస్తున్నారు’ అని రానా వెల్లడించాడు.
వడోదర వన్డేలో కివీస్ నిర్దేశించిన 301 పరుగుల ఛేదనలో విరాట్ కోహ్లీ(93), శ్రేయాస్ అయ్యర్(49) మెరుపులతో పటిష్ట స్థితిలో ఉన్న టీమిండియా ఒక్కసారిగా కష్టాల్లో పడింది. జేమీసన్ ఓవర్లో విరాట్ ఔటయ్యాక వెంట వెంటనే మూడు వికెట్లు పడిన దశలో క్రీజులోకి వచ్చిన హర్షిత్.. విధ్వంసక ఆటతో పరుగుల అంతరాన్ని తగ్గించాడు. పెద్ద షాట్లు ఆడుతూ కేఎల్ రాహుల్‌తో కలిసి కివీస్ బౌలర్లపై ఒత్తిడి పెంచిన రానా 29 పరుగులతో రాణించాడు.
The Indian dugout surely enjoyed that SIX from Harshit Rana 💥
📸: JioHotstar #INDvsNZ #ODIs #Vadodara #Insidesport #CricketTwitter pic.twitter.com/JjKNXRjAw4
— InsideSport (@InsideSportIND) January 11, 2026
ఆస్ట్రేలియాతో రెండో టీ20లోనూ ఈ పేసర్‌ను అనూహ్యంగా శివం దూబే కంటే ముందుగా పంపారు. ఆ మ్యాచ్‌లో 35 రన్స్‌తో మెరిశాడీ స్పీడ్‌స్టర్. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ వరకూ హర్షిత్ ఇలానే బ్యాటుతో, బంతితో రాణిస్తే.. ఆల్‌రౌండర్‌గా స్క్వాడ్‌లో ఉండడం పక్కా అంటున్నారు విశ్లేషకులు.