IND vs SA : ధర్మశాలలో జరుగుతున్న మూడో టీ20లో భారత బౌలర్లు రెచ్చిపోతున్నారు. టాస్ ఓడిన దక్షిణాఫ్రికాను వణికిస్తూ.. ఆదిలోనే టాపార్డర్‌ను కుప్పకూల్చారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే రీజా హెండ్రిక్స్(0)ను అర్ష్‌దీప్ సింగ్ వెనక్కి పంపాడు. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే డేంజరస్ క్వింటన్ డికాక్(0)ను హర్షిత్ రానా(2-5) ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. తన రెండో ఓవర్లో డెవాల్డ్ బ్రెవిస్(2)ను ఔట్ చేసి సఫారీలను కష్టాల్లోకి నెట్టాడు రానా.
పొట్టి సిరీస్‌లో కీలకమైన మూడో టీ20 కోసం రెండు మార్పులు చేసిన భారత వ్యూహం ఫలించింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే రీజా హెండ్రిక్స్(0)ను అర్ష్‌దీప్ సింగ్ బోల్తా కొట్టించాడు. ఆ తర్వాతి ఓవర్లో గత మ్యాచ్ హీరో క్వింటన్ డికాక్(0)ను హర్షిత్ రానా డకౌట్‌గా వెనక్కి పంపాడు. తన రెండో ఓవర్లో డెవాల్డ్ బ్రెవిస్(2)ను ఔట్ చేసి సఫారీలను మరింత కష్టాల్లోకి నెట్టాడు రానా.
Harshit Rana with a wicket in first over as well! 🙌
Cracking start for #TeamIndia in Dharamshala! 👌
Updates ▶️ https://t.co/AJZYgMAHc0#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/Hjq45qKyjq
— BCCI (@BCCI) December 14, 2025
టీ20ల్లో అత్యధికసార్లు డకౌటైన దక్షిణాఫ్రికా క్రికెటర్‌గా డికాక్ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. హెండ్రిక్స్ ఏడుసార్లు సున్నా చుట్టేసి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. చూస్తుండగానే మూడు వికెట్లు పడడంతో కెప్టెన్ ఎడెన్ మర్క్రమ్(5), స్టబ్స్(3) జాగ్రత్తగా ఆడుతున్నారు. 4 ఓవర్లకు స్కోర్.. 11-3.