ECB : స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో తలపడుతున్న ఇంగ్లండ్(England)కు మరో షాక్. రెగ్యులర్ కెప్టెన్ జోస్ బట్లర్ (Jos Buttler) కాలి మడియ కండరాల గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. దాంతో, ఆసీస్‌తో జరగాల్సిన వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. అందువల్ల కొత్త సారథిని ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ సెలెక్టర్లు తాత్కాలికంగా యువకెరటం హ్యారీ బ్రూక్(Harry Brook)కు పగ్గాలు అప్పగించారు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది.
టెస్టుల్లో శతకాలతో చెలరేగిన బ్రూక్ ఏ ఫార్మాట్లోనైనా ఇంగ్లండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించడం ఇదే మొదటిసారి. అయితే.. అండర్ -19 విభాగంలో ఇంగ్లండ్‌ను నడిపించిన అనుభవం అతడికి ఉంది. కంగారూలతో వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఇప్పటికే స్క్వాడ్‌ను ప్రకటించింది. టీ20 సిరీస్ సెప్టెంబర్ 15న ముగిశాక నాలుగు వన్డేల సిరీస్ మొదలవ్వనుంది. సెప్టెంబర్ 21న తొలి వన్డే, 24న రెండో వన్డే, 27న మూడో వన్డే, 29న నాలుగో వన్డే జరుగనున్నాయి.
Speedy recovery, Jos 🙏
Go well captain Brooky 👏
ODI squad updates 👇
🏴 #ENGvAUS 🇦🇺 | #EnglandCricket— England Cricket (@englandcricket) September 15, 2024
ఇంగ్లండ్ వన్డే స్క్వాడ్ : హ్యారీ బ్రూక్(కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, జాకబ్ బెథెల్, బ్రాడిన్ కర్సే, జోర్డాన్ కాక్స్, బెన్ డకెట్, విల్ జాక్స్, లియాం లివింగ్‌స్టోన్, మాథ్యూ పాట్స్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జేమీ స్మిత్(వికెట్ కీపర్), ఓలీ స్టోన్, రీసే టాప్లే, జాన్ టర్నర్.
బట్లర్ గాయం కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ హీరో ఫిల్ సాల్ట్(Phil Salt) ఇంగ్లండ్ సారథిగా జాక్‌పాట్ కొట్టాడు. కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) తరఫున 17వ సీజన్లో రెచ్చిపోయి ఆడిన సాల్ట్ ఇంగ్లండ్ టీ20 కెప్టెన్సీ వరించింది. విధ్వంసక ఓపెనర్, వికెట్ కీపర్ అయిన సాల్ట్‌కు సెలెక్టర్లు సారథ్య పగ్గాలు అప్పగించారు.