ODI World Cup : క్రికెట్ అభిమానులను రంజింపజేస్తూ భారత పురుషుల జట్టు రెండు పర్యాయాలు వన్డే వరల్డ్ కప్ (ODI World Cup)ను ముద్దాడింది. కానీ, మహిళల జట్టు మాత్రం ఒక్కటంటే ఒక్కసారి కూడా ఈ ట్రోఫీని అందుకోలేదు. గతంలో రెండు పర్యాయాలు ఫైనల్ చేరినా రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది టీమిండియా. ఆరంభ ఎడిషన్ నుంచి అందని ద్రాక్షలా ఊరిస్తున్న ప్రపంచకప్‌ను పట్టేయాల్సిన సమయం వచ్చింది. సొంతగడ్డపై మరో మూడు రోజుల్లో మెగా టోర్నీ ప్రారంభం కానుంది. దాంతో.. వరల్డ్ కప్ ఛాంపియన్ అనిపించుకునేందుకు ఇంతకంటే మంచి తరణం ఉండదంటున్నారు విశ్లేషకులు. హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) సేన ‘ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు’ అనే స్లోగన్‌తో ట్రోఫీ వేటకు సిద్ధమవుతోంది.
వరల్డ్ కప్.. ఒక్కసారి గెలిచినా చాలు జన్మధన్యమైనట్టే అనుకుంటారు క్రికెటర్లు. జాతీయ జట్టుకు ఆడడం ఎంత షంతోషాన్ని ఇస్తుందో.. ప్రపంచకప్ విజేత అనే ట్యాగ్ అంతకు వెయ్యిరెట్ల ఆనందాన్ని ఇస్తుంది ఎవరికైనా. అదేంటోగానీ.. భారత మహిళా జట్టు మాత్రం ఏళ్లుగా ట్రోఫీ కోసం నిరీక్షిస్తోంది. ఆసియా కప్‌ను రికార్డు స్థాయిలో ఏడుసార్లు గెలుపొందిన భారత్.. వరల్డ్ కప్ ట్రోఫీ వేటలో తడబడుతూ వస్తోంది.
Game face 🔛
Captain Harmanpreet Kaur-led #TeamIndia are #CWC25 Ready 😎
🎟️ Get your tickets now 👉https://t.co/vGzkkgwXt4#WomenInBlue | @ImHarmanpreet pic.twitter.com/kLgjW4pkUk
— BCCI Women (@BCCIWomen) September 26, 2025
ఫైనల్ ఫోబియాతో రెండుసార్లు టైటిల్ వేటలో తడబడింది మన టీమ్. 2005లో ఫైనల్ చేరినా ఆస్ట్రేలియా చేతిలో 98 పరుగుల తేడాతో ఓటమి ఎదురైంది. అనంతరం 2017లో ఇంగ్లండ్ 9 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించింది. ఫలితంగా వెటరన్ ప్లేయర్లు మిథాలీ రాజ్, ఝులాన్ గోస్వామి.. నుంచి హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన వరకూ వన్డే వరల్డ్ కప్ కలను నిజం చేసుకోలేకపోయారు.
సెప్టెంబర్ 30 నుంచి జరుగబోయే వరల్డ్ కప్ పోటీలకు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. స్వదేశంలో మెగా టోర్నీ నిర్వహిస్తుండడంతో ఈసారి ట్రోఫీపై ఆశలు పెట్టుకుంది హర్మన్‌ప్రీత్ బృందం. ఎందుకంటే.. ఈ ఏడాది జట్టు సూపర్ ఫామ్‌లో ఉంది. ముఖ్యంగా ఓపెనర్లు స్మృతి మంధాన(Smriti Mandhana), ప్రతీకా రావల్(Pratika Rawal) పరుగుల వరద పారిస్తున్నారు. ఈ సంవత్సరలో టీమిండియా 14 వన్డేల్లో పదింటా విజయం సాధించింది. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో మంధాన రెండు సెంచరీలతో చెలరేగింది.
– Sachin Tendulkar in 1998 (greatest ever)
– Sourav Ganguly in 1999
– Rohit Sharma in 2019
– Virat Kohli in 2017
Smriti Mandhana’s ODI run this year has to be amongst the greatest ever in Indian ODI history !!#INDvAUS #SmritiMandhana pic.twitter.com/qlG3ItWl4L— SAHIL NAGPAL (@Pavilionpulse) September 20, 2025
భారత జట్టు వరల్డ్ కప్ ట్రోఫీ నిరీక్షణకు తెరపడాలంటే టాపార్డర్‌లో ప్రతీకా, మంధాన, కెప్టెన్ కౌర్, జెమీమా రాణించడం చాలా ముఖ్యం. మిడిలార్డర్లో హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, రీచా ఘోష్, రాధా యాదవ్ బ్యాట్ ఝులిపించాలి. బౌలింగ్ యూనిట్‌లోని రేణుకా సింగ్, శ్రీ చరణి, స్నేహ్ రానాలు.. వికెట్ల వేట కొనసాగించాల్సి ఉంటుంది. మొత్తంగా.. సమిష్టిగా చెలరేగి ఆడితేనే తొలిసారి వరల్డ్ కప్‌ను ఒడిసిపట్టడం ఖాయమే.
From dreams coming true to playing their first ODI World Cup for #TeamIndia 💙
We asked our #WomenInBlue to share a message for themselves 🗣️🤗
WATCH 🎥🔽 – By @mihirlee_58
🎟️ The time is ticking as history awaits at #CWC25! Get your tickets today: https://t.co/vGzkkgwXt4 pic.twitter.com/d3X3obSwq4
— BCCI Women (@BCCIWomen) September 26, 2025
ఒక్కసారి వరల్డ్ కప్ అందుకొని మురిసిపోవాలని భారత జట్టు ఆరాటపడుతుంటే.. ఆస్ట్రేలియా ఏకంగా ఏడుసార్లు ట్రోఫీని ఎగరేసుకుపోయింది. ఇంగ్లండ్ మూడు పర్యాయాలు, న్యూజిలాండ్ ఒకసారి ప్రపంచ కప్‌ను తన్నుకుపోయాయి. టీమిండియా సహా దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంక, పాకిస్థాన్.. జట్లు కూడా ట్రోఫీ గెలవాలనే పట్టుదలతో ఉన్నాయి. అయితే.. వరల్డ్ కప్ చరిత్రలో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న ఆసీస్‌కు చెక్ పెడితినే కప్ అందుతుంది. మరి.. కంగారూలను దాటి కొత్త ఛాంపియన్‌ను చూస్తామా? లేదా? అనేది నవంబర్ 2న తేలియనుంది.