Harmanpreet Kaur : వరల్డ్ కప్ ఛాంపియన్ అనిపించునేందుకు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న భారత జట్టుకు సువర్ణావకాశం. స్వదేశంలో ట్రోఫీని ముద్దాడే సందర్భం వచ్చేసింది. ఆదివారం ఫైనల్లో దక్షిణాఫ్రికా (South Africa)ను ఓడిస్తే విశ్వవిజేతగా టీమిండియా అవతరించనుంది. ఆస్ట్రేలియాను చిత్తు చేసిన ఉత్సాహంతో టైటిల్ పోరులోనూ విజయంపై కన్నేసిన హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur ) సేన అంతకంటే ముందు ఒత్తిడిని జయించాల్సి ఉంది. సొంత ప్రేక్షకుల సమక్షంలో బిగ్ ఫైట్‌కు సిద్దమవుతున్న కెప్టెన్ మీడియా సమావేశంలో తమ వ్యూహం గురించి మాట్లాడింది. అదే సమయంలో సఫారీలను తేలికగా తీసుకోమని ఆమె స్పష్టం చేసింది.
‘ప్రపంచ కప్‌ను భారీ ఓటమితో ఆరంభించిన దక్షిణాఫ్రికా ఆ తర్వాత గొప్పగా ఆడింది. వరుస విజయాలతో సెమీస్ చేరుకుంది. మెగా టోర్నీలో సఫారీల ప్రదర్శన అద్భుతమని చెప్పాలి. అంతేకాదు వాళ్లది సమతూకంతో కూడిన జట్టు. పటిష్టమైన బౌలింగ్ దళమే కాదు.. లోయర్ ఆర్డర్లోనూ చెలరేగిపోయే బ్యాటర్లు ఉన్నారు. మా జట్టులోనూ అనేక సానుకూల అంశాలున్నాయి. రేపు జరుగబోయే ఫైనల్ ఆసక్తిగా ఉండనుంది. బిగ్ మ్యాచ్ కోసం మేము మానసికంగా, శారీరకంగా సిద్ధమవుతున్నాం. రేపు మేము గొప్ప ప్రదర్శన చేసి..మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తామని ఆశిస్తున్నా. అయితే.. ముంబై ప్రేక్షకులు ఎంతో మద్దుతిస్తున్నారు.
𝐄𝐱𝐜𝐢𝐭𝐞𝐦𝐞𝐧𝐭. 𝐄𝐧𝐞𝐫𝐠𝐲. 𝐀𝐧𝐝 𝐭𝐢𝐜𝐤𝐞𝐭 𝐩𝐫𝐞𝐬𝐬𝐮𝐫𝐞! 😄
Harmanpreet Kaur shares her thoughts on the buzz around the big final- proud of how two new teams have made it this far, and confident India will rise to the occasion! 💪🇮🇳
WATCH #CWC25 FINAL 👉… pic.twitter.com/WUYIdFMR6K
— Star Sports (@StarSportsIndia) November 1, 2025
స్వదేశంలో వరల్డ్ కప్ ఆడడం అనేది ఎన్నో భావోద్వేగాలతో కూడుకున్నది. అదే సమయంలో..రేపటి మ్యాచ్ మా అందరికి ఎంతో ముఖ్యమైంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఆడినట్టే సమిష్టిగా రాణించాలని భావిస్తున్నాం. అందుకు అవసరమైన ఫోకస్ కోసం డ్రెస్సింగ్ రూమ్‌లో సెషన్స్ నిర్వహించాం. కెప్టెన్‌గా వరల్డ్ కప్ ఫైనల్ ఆడడం నాకు గొప్ప విషయం. చిన్నచిన్న లక్ష్యాలతో ముందుకు సాగితే.. పెద్దవి కూడా సాధ్యమవుతాయి. ఇదే సూత్రాన్ని జట్టు సభ్యులకు చెబుతున్నా’ అని పేర్కొంది కౌర్.
సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచ కప్‌లో ఫేవరెట్ భారత జట్టు గొప్ప పోరాటపటిమతో ఫైనల్ చేరింది. లీగ్ దశలో న్యూజిలాండ్‌పై భారీ విజయంతో సెమీస్ చేరిన టీమిండియా అదిరే ఆటతో ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో.. కంగారూ టీమ్ 339 పరుగుల కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే షఫాలీ వర్మ(10) ఎల్బీగా ఔటయ్యింది.
Captain’s knock! 🫡#AaliRe #CWC25 #AUSvIND | Harmanpreet Kaur pic.twitter.com/PdCIKgKFl4
— Mumbai Indians (@mipaltan) October 30, 2025
ఫామ్‌లో ఉన్న స్మృతి మంధాన(24) దురదృష్టవశాత్తూ వికెట్ కీపర్ చేతికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఇక ఆడేది ఎవరు? జట్టును గెలిపించేది ఎవరు? అనుకున్న వేళ. జెమీమా రోడ్రిగ్స్(127 నాటౌట్), హర్మన్‌ప్రీత్ కౌర్(89)లు క్రీజులో పాతుకుపోయి ప్రత్యర్థి బౌలర్లకు పరీక్ష పెట్టారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 167 రన్స్ జోడించగా రికార్డు లక్ష్యాన్ని కరిగించి రికార్డు నెలకొల్పింది టీమిండియా. ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా కంగారూలను కంగారెత్తించిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన.. 2017 సెమీఫైనల్ ఫలితాన్ని పునరావృతం చేసింది.