ఢిల్లీ : భారీ అంచనాలతో టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగి పేలవమైన ఆటతీరుతో గ్రూప్ దశలోనే జట్టు ఇంటిబాట పట్టడంతో హర్మన్‌ప్రీత్ కౌర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించాలని డిమాండ్లు వస్తున్నా బీసీసీఐ మాత్రం మరోసారి ఆమెకే సారథ్య పగ్గాలను అప్పగించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జపాన్ ఆతిథ్యమివ్వనున్న ఆసియా క్రీడల కోసం పోటీపడే భారత మహిళా క్రికెట్ జట్టును మంగళవారం ప్రకటించగా 15 మందితో కూడిన జట్టుకు హర్మన్ నాయకత్వం వహించనుంది.
సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 04 మధ్య జరుగబోయే ఈ మెగా టోర్నీలో భారత జట్టు డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ప్రపంచకప్‌నకు ఎంపికైన జట్టులో యస్తికా భాటియా మాత్రమే చోటు కోల్పోగా పెద్దగా మార్పులేమీ లేవు. ఆమె స్థానంలో జి. కమిలిని ఎంపికైంది.
భారత జట్టు: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), మంధాన, షెఫాలీ, జెమీమా, దీప్తి, రిచా, కమిలిని, ఫుల్మలి, శ్రీచరణి, రేణుక, క్రాంతి, అరుంధతి, శ్రేయాంక, రాధా, నందిని.