దుబాయ్: మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీ టీమ్‌లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్ చోటు దక్కించుకుంది. మెగాటోర్నీలో సత్తాచాటిన ప్లేయర్ల సమాహారంతో ఐసీసీ జట్టును ఎంపిక చేసింది. టీమ్ఇండియా లీగ్ దశలోనే నిష్క్రమించగా, హర్మన్‌ప్రీత్‌కౌర్ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆస్ట్రేలియాతో ఆఖరి లీగ్ మ్యాచ్‌లో అర్ధసెంచరీతో జట్టును గెలిపించేందుకు కడదాకా ప్రయత్నం చేసింది. తొలిసారి టీ20 ప్రపంచకప్ గెలిచిన న్యూజిలాండ్ నుంచి అమెలియా కెర్, రోసిమేరీ, ఎడ్సన్ కార్సన్ జట్టులో చోటు దక్కించుకున్నారు.
టీ20 ప్రపంచకప్ టీమ్:
లారా వోల్వార్డ్(కెప్టెన్), బ్రిట్స్, డానీ వ్యాట్, అమెలియా కెర్, హర్మన్‌ప్రీత్‌కౌర్, దియోంద్ర దాటిన్, నిగార్ సుల్తానా, ఫ్లెచర్, రోసిమేరీ, మాల్బా, మేగన్ స్కట్, ఎడెన్ కార్సన్.