INDW VS BANW : బంగ్లాదేశ్ పర్యటనను భారత మహిళల జట్టు(Indian Womens Cricket Team) విజయంతో ప్రారంభించింది. మొదటి టీ20లో ఘన విజయం సాధించింది. ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియం(Shere Bangla National Stadium)లో ఆతిథ్య జట్టుపై ఏడు వికెట్లతో గెలుపొందింది. మహిళల ప్రీమియర్ లీగ్(WPL) తొలి సీజన్లో దుమ్మురేపిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(54 నాటౌట్) అర్ధ శతకంతో జట్టును విజయ తీరాలకు చేర్చింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) బంగ్లాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే.. నిర్ణీత ఓవర్లలో ఆతిథ్య జట్టు 5 వికెట్ల నష్టానికి 114 పరుగులు కొట్టింది. స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ(0) డకౌట్ అయింది.
That’s that from the 1st T20I.
A convincing 7-wicket win in the first T20I over Bangladesh and #TeamIndia take a 1-0 lead in the series.
Captain @ImHarmanpreet (54*) hits the winning runs as we win with 22 balls to spare.
Scorecard – https://t.co/QjTdi2Osrg #BANvIND pic.twitter.com/zeSveT5nHF
— BCCI Women (@BCCIWomen) July 9, 2023
ఆ తర్వాత వచ్చిన జెమీమీ రోడ్రిగ్స్(11)ను సుల్లానా ఖటున్ బౌల్డ్ చేసింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన హర్మన్‌ప్రీత్ కౌర్(54 నాటౌట్), స్మృతి మంధానా(38)తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పింది. మంధాన ఔటయ్యాక యస్తికా భాటియా(9 నాటౌట్)తో కలిసి జట్టును గెలిపించింది. రెండో టీ20 జూలై 11న ఢాకాలో జరగనుంది.