MS Dhoni | ధోనీ జీవితంలోని మధుర క్షణాలు.. ఈ ఒక్క వీడియోలో చూసేయండి
MS Dhoni : భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni)ని ఇష్టపడని వారుండరు. సౌమ్యుడిగా పేరొందిన మహీ తన కూల్ కెప్టెన్సీతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అంతేకాదు టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీ(ICC Trophies)లు అందించిన ఏకైక కెప్టెన్ అతనే. నిన్ననే 42వ పుట్టిన రోజు చేసుకున్న ఈ దిగ్గజ ఆటగాడిపై ఓ అభిమాని ఆసక్తికర వీడియో తయారుచేశాడు. అందులో ధోనీ....
MS Dhoni : భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni)ని ఇష్టపడని వారుండరు. సౌమ్యుడిగా పేరొందిన మహీ తన కూల్ కెప్టెన్సీతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అంతేకాదు టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీ(ICC Trophies)లు అందించిన ఏకైక కెప్టెన్ అతనే. నిన్ననే 42వ పుట్టిన రోజు చేసుకున్న ఈ దిగ్గజ ఆటగాడిపై ఓ అభిమాని ఆసక్తికర వీడియో తయారుచేశాడు. అందులో ధోనీ జీవితంలోని మధుర క్షణాలను వరుసక్రమంలో పొందుపరిచాడు. ప్రస్తుతం ఈ వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది.
అవును.. అదొక పించ్ టు జూమ్ (Pinch To Zoom)వీడియో. ఆ వీడియోను జూమ్ చేసే కొద్దీ ధోనీ క్రికెటింగ్ జర్నీ కళ్ల ముందు మెదులుతుంది. రైల్వే టీసీగా ఉద్యోగం చేస్తూనే ఈ జార్ఖండ్ డైనమైట్(Jharkhand Dynamite) క్రికెట్లో రాణించాడు. అక్కడ రైల్వే జట్టు(Rialway Team) తరఫున చితకబాదుతూ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. దాంతో భారత జట్టులోకి వచ్చాడు. తన అద్భుత ఆటతో మెప్పించి ఆ తర్వాత కెప్టెన్‌గా బాధ్యతలుచేపట్టాడు. భారత జట్టుకు టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ అందించాడు.
MS Dhoni Journey In One Video 💛💫. @msdhoni @imjadeja pic.twitter.com/c4xVkNo8ow
— Umar Chumtya (@UmarAukmal) July 8, 2023
జడ్డూను ఎత్తుకున్న ఫొటోతో
16వ సీజన్ ఐపీఎల్(IPL)కు ముందు నెట్స్‌లో ధోనీ భారీ కండలతో ఉన్న ఫొటో, ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)ని గెలిపించిన రవీంద్ర జడేజాను ఆప్యాయంగా ఎత్తుకున్న ఫొటోతో వీడియో ముగుస్తుంది. నిమిషం 3 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో టీమిండియా మాజీ కెప్టెన్ జీవితంలోని ముఖ్యమైన దశల్ని చూపించిన తీరు ప్రశంసనీయం.
పదహారో సీజన్ ఐపీఎల్ ట్రోఫీతో ధోనీ

భారత జట్టు గొప్ప కెప్టెన్లలో ఒకడైన ఎంస్ ధోనీ ఈమధ్యే చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐదో ఐపీఎల్ ట్రోఫీని అందించాడు. డిఫెండింగ్ చాంపియిన్ గుజరాత్ టైటాన్స్(Gujart Titans)తో జరిగిన ఫైనల్లో రవీంద్ర జడేజా (11 నాటౌట్) ఆఖరి రెండు బంతులకు సిక్స్, ఫోర్ కొట్టి చెన్నైని గెలిపించాడు.
ఇవి కూడా చదవండి
IND Vs PAK | ప్రపంచకప్ ఆడేందుకు భారత్‌కు పాక్ వస్తుందా..? ఆ దేశ క్రీడల మంత్రి ఏమన్నారంటే..?
Alastair Cook | ఆసీస్ వికెట్ కీపర్‌పై దుష్ప్రచారం.. క్షమాపణలు చెప్పిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

