Alastair Cook | ఆసీస్ వికెట్ కీపర్‌పై దుష్ప్రచారం.. క్షమాపణలు చెప్పిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
Alastair Cook : ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్(Alastair Cook) ఆస్ట్రేలియా కీపర్ అలెక్స్ క్యారీ(Alex Carey)కి క్షమాపణలు చెప్పాడు. లీడ్స్‌లోని బార్బర్(Barber)కు క్యారీ 30 యూరోలు (రూ. 2,718) ఎగ్గొట్టలేదని, మరొక వ్యక్తికి క్యారీ అనుకొని పొరపడి తానే తప్పుడు ప్రచారం చేశానని తెలిపాడు. దాంతో, ఆసీస్ యాజమాన్యం(Australia Management)...
Alastair Cook : ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్(Alastair Cook) ఆస్ట్రేలియా కీపర్ అలెక్స్ క్యారీ(Alex Carey)కి క్షమాపణలు చెప్పాడు. లీడ్స్‌లోని బార్బర్(Barber)కు క్యారీ 30 యూరోలు (రూ. 2,718) ఎగ్గొట్టలేదని, మరొక వ్యక్తికి క్యారీ అనుకొని పొరపడి తానే తప్పుడు ప్రచారం చేశానని తెలిపాడు. ఆసీస్ కీపర్ బార్బర్‌కు డబ్బులు ఇవ్వలేదని ఇంగ్లీష్ మీడియా కోడై కూసింది. దాంతో, ఆసీస్ యాజమాన్యం(Australia Management) ఈ విషయంపై స్పష్టత ఇచ్చింది.
తమ జట్టు లండన్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి క్యారీ కటింగ్ చేసుకోలేదని తెలిపింది. ఆ తర్వాత స్పందించిన కుక్.. ‘పొరపాటు జరిగింది. వేరే వ్యక్తిని క్యారీ అనుకొని తప్పుడు ప్రచారం చేసినందుకు క్షమాపణలు చెప్తున్నా’ అని అన్నాడు. ఆడం మహమూద్(Adam Mahmood) అనే బార్బర్ వద్ద క్యారీ కటింగ్ చేసుకొన్నాడని, తీరా ఆ బార్బర్‌కు డబ్బులు ఇవ్వలేదనే వార్త నిన్న మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే.. ఈ ఆసీస్ కీపర్ తన వద్ద అంత డబ్బు లేదని, తప్పకుండా ఇచ్చేస్తానని ఆడంకు ప్రామిస్ చేశాడట. కానీ, పైసా కూడా ఇవ్వకపోవడడంతో చిర్రెత్తుకొచ్చిన మహమూద్ క్యారీకి డెడ్‌లైన్ విధించాడట. ఈ సోమవారం(జూలై 10)లోగా డబ్బులు ముడితే తాను సంతోషిస్తానని అన్నట్టు మీడియాలో వచ్చింది.
ఇంగ్లండ్ బోణీ కొట్టేనా
యాషెస్ సిరీస్(Ashes Series)లో జోరు కొనసాగిస్తున్న ఆస్ట్రేలియా మూడో టెస్టులో వెనకబడింది. ఆతిథ్య జట్టుకు 244 పరుగులు చేస్తే సిరీస్‌లో నిలుస్తుంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. ఓపెనర్లు బెన్ డకెట్(18), జాక్ క్రాలే(9) ఆడుతున్నారు.
జాక్ క్రాలే, బెన్ డకెట్

అయితే.. నాలుగో రోజు తొలి సెషన్ కీలకం కానుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టిన ప్యాట్ కమిన్స్ మళ్లీ చెలరేగాలని ఆసీస్ కోరుకుంటోంది. మరోవైపు చావో రేవో లాంటి ఈ మ్యాచ్‌లో బెన్ స్టోక్స్(Ben Stokes) బృందం గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. తొలి రెండు టెస్టుల్లో నెగ్గిన ఆసీస్ ఐదు టెస్టుల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో ఉంది.
ఇవి కూడా చదవండి
Canada Open 2023 | కెనడా ఓపెన్ ఫైనల్లో లక్ష్యసేన్.. మరోసారి నిరాశపరిచిన సింధు
Wimbledon | వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో దూసుకెళ్తున్న అల్కరాజ్.. ప్రిక్వార్టర్స్‌కు చేరిన స్పెయిన్ వీరుడు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

