Harish Rao : పాలమూరు–రంగారెడ్డి డీపీఆర్ వాపస్ వచ్చి ఏడు నెలలైనా ఎందుకు మౌనంగా ఉన్నారు? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీశ్ రావు (Harish Rao) ప్రశ్నించారు. తెలంగాణకు 45 టీఎంసీలు చాలు అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి లేఖ రాసిండని, ఈ విషయం తెలిసి కూడా సిగ్గులేకుండా ‘మేం రాయలేదు’ అని సీఎం రేవంత్ అంటున్నారని హరీశ్ ధ్వజమెత్తారు.
తెలంగాణ భవన్లో ఆదివారం కేసీఆర్ ప్రెస్‌మీట్‌తో ఉలిక్కిపడి.. చిట్‌చాట్‌లో అబద్దాలను వల్లెవేసిన సీఎం రేవంత్ రెడ్డిపై హరిశ్‌రావు మండిపడ్డారు. ‘పాలమూరు–రంగారెడ్డి డీపీఆర్ వాపస్ తెస్తవు, 45 టీఎంసీలు చాలు అంటవు. ఇదంతా ఎవరి డైరెక్షన్.. చంద్రబాబు డైరెక్షనా? అనేది రాష్ట్ర ప్రజలకు తెలియాలి. బీఆర్ఎస్ సంధిస్తున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా చిల్లర వాగుడు ఎందుకు? 45 టీఎంసీలు చాలు అని నువ్వు లెటర్ రాసావు.. మళ్లీ సిగ్గులేకుండా మాట్లాడుతున్నావు’ అని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను హరీశ్ రావు ఆధారాలతో సహ బయటపెట్టారు.
పాలమూరు–రంగారెడ్డి డీపీఆర్ వాపస్ వచ్చి ఏడు నెలలైనా
ఎందుకు మౌనంగా ఉన్నారు?ఇది కాకుండా 45 టీఎంసీలు చాలు అంటూ ఢిల్లీకి రాసిండు మంత్రి ఉత్తమ్, సీఎం రేవంత్… ఇప్పుడు సిగ్గులేకుండా మేం రాయలేదు అంటున్నారు.
డీపీఆర్ వాపస్ తెస్తవు, 45 టీఎంసీలు చాలు అంటవు.
ఎవరి డైరెక్షన్.. చంద్రబాబు… pic.twitter.com/fJnTmWO75F— BRS Party (@BRSparty) December 22, 2025
అంతేకాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడకముందే ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1గా ఉందని హరీశ్ రావు పేర్కొన్నారు. ‘నువ్వు రాకముందే ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉంది. 2022-23 లోనే 258 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసి దేశంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ధాన్యం సేకరణలో కూడా 2020-21లో 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి రికార్డు నెలకొల్పినం’ అని హరీశ్ రావు ఆధారాలను చూపించారు.
రేవంత్ రెడ్డి. నువ్వు రాకముందే
ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉంది.2022-23 లోనే 258 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసి
దేశంలో తెలంగాణను నెంబర్ 1గా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వంధాన్యం సేకరణలో కూడా 2020-21లో
141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి రికార్డు… pic.twitter.com/QXSHnZsrGq— Office of Harish Rao (@HarishRaoOffice) December 22, 2025