Pandya- Kohli : భారత స్టార్ బ్యాటర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) వరసగా మరో సిరీస్‌కు దూరం కానున్నాడు. ఐపీఎల్ 19వ సీజన్లో వెన్నునొప్పితో ఇబ్బంది పడిన పాండ్యా.. అఫ్గనిస్థాన్‌తో వన్డేలకు అందుబాటులో లేడు. త్వరలో ఇంగ్లండ్(England)తో వన్డే సిరీస్‌కు సైతం ఆ పేస్ ఆల్‌రౌండర్ అందుబాటులో ఉండడం లేదు. అందుకు కారణం 50 ఓవర్ల ఫార్మాట్‌కు అవసరమైన ఫిట్నెస్ సాధించకపోవడమేనని సమాచారం. టీమిండియాకు తీపికబురు ఏంటంటే.. విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇంగ్లండ్ సిరీస్‌లో ఆడే అవకాశాలున్నాయి.
ఇంగ్లండ్ పర్యటనకు భారత జట్టు కీలక ఆటగాడైన హార్దిక్ పాండ్యా సేవల్ని కోల్పోనుంది. 19వ సీజన్ ఐపీఎల్లో వెన్ను నొప్పితో ఇబ్బందిపడిన పాండ్యా.. సీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కోలుకుంటున్నాడు. ఈమధ్యే ఫిట్నెస్, బౌలింగ్ పరీక్ష నిర్వహించగా అతడు నిర్దేశించిన ప్రమాణాలు అందుకోలేదు. బౌలింగ్ భారం పడుతున్నందున పాండ్యా కోలుకునేందుకు మరింత సమయం పట్టనుందని సీఓఏ చెబుతోంది.
Hardik Pandya ruled out of the England ODI series.
– Virat Kohli’s fitness test will be conducted on 26th June. (Abhishek Tripathi). pic.twitter.com/vNT2UN2F7N
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 20, 2026
మరోవైపు.. ఐపీఎల్ 19వ సీజన్లో తొడ కండరాల గాయంతో బాధ పడిన విరాట్ కోహ్లీ వేగంగా కోలుకుంటున్నాడు. అఫ్గనిస్థాన్‌తో వన్డే సిరీస్‌కు దూరమైన రన్ మెషిన్ ఇంగ్లండ్ సిరీస్ లక్ష్యంగా సన్నద్ధమవుతున్నాడు. ‘కుడి తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీ వేగంగా కోలుకుంటున్నాడు. లండన్‌లో అతడిని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ బృందం పర్యవేక్షించింది. ప్రస్తుతం రిహాబిలిటేషన్‌లో ఉన్న కోహ్లీ.. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే అవకాశాలు మెరుగవుతున్నాయి’ అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో వన్డేల్లోనే కొనసాగుతున్న విరాట్ జూన్ 22న బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చేరనున్నాడు. అక్కడ రిహాబిలిటేషన్‌లో ఫిట్నెస్ చాటుకుంటే ఇంగ్లండ్ పర్యటనకు కోహ్లీ వెళ్లడం పక్కా. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ ఆడాలనుకుంటున్న కోహ్లీకి ఈ సిరీస్ కీలకం కానుంది. జూలై 14 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్యమూడు వన్డేల సిరీస్ జరుగనుంది.