గ్వాలియర్: టీ20ల్లో విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును హార్దిక్ పాండ్యా(Hardik Pandya) బ్రేక్ చేశాడు. గ్వాలియర్‌లో ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. తొలి బౌలింగ్‌లో 4 ఓవర్లలో 26 రన్స్ ఇచ్చి ఓ వికెట్ తీసుకున్నాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌లో అతను దుమ్మురేపాడు. కేవలం 16 బంతుల్లోనే 39 రన్స్ చేశాడు. దాంట్లో అయిదు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. 243.75 స్ట్రయిక్ రేట్‌తో అతను చెలరేగిపోయాడు. అయితే ఆ హిట్టింగ్ సమయంలోనే.. కోహ్లీ రికార్డును పాండ్యా బ్రేక్ చేశాడు.
ఇప్పటి వరకు టీ20ల్లో.. సిక్సర్‌తో టీమిండియాను అయిదుసార్లు గెలిపించాడు పాండ్యా. గతంలో కోహ్లీ పేరిట ఉన్న రికార్డును అతను బ్రేక్ చేశాడు. కోహ్లీ ఇప్పటి వరకు నాలుగు సార్లు సిక్సర్‌తో భారత జట్టుకు విజయాన్ని అందించాడు. ఇక టీ20ల్లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన నాలుగవ బౌలర్‌గా హార్దిక్ పాండ్యా నిలిచాడు. 87 వికెట్లు తీసిన పాండ్యా.. ఆ ఫార్మాట్లో నాలుగవ స్థానంలో ఉన్నాడు. హర్షదీప్ సింగ్ ఖాతాలో 86 వికెట్లు ఉన్నాయి. భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా యజువేంద్ర చాహల్ నిలిచాడు. అతను ఇప్పటి వరకు 96 వికెట్లు తీసుకున్నాడు.
బంగ్లాతో మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ఓ వెరైటీ షాట్ కొట్టాడు. తస్కిన్ వేసిన బౌన్సర్‌ను .. వికెట్ కీపర్ మీదుగా బాదాడు. శరీరం మీదకు వచ్చిన బౌన్స్‌ను.. కేవలం తన బ్యాట్‌తో కీపర్ వైపు మళ్లించాడు. ఆ బంతి బౌండరీకి వెళ్లింది. ఆ స్ట్రోక్‌కు చెందిన వీడియోను బీసీసీఐ తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేసింది.
𝘿𝙊 𝙉𝙊𝙏 𝙈𝙄𝙎𝙎!
The shot. The reaction. The result ➡️ EPIC 😎
WATCH 🎥🔽 #TeamIndia | #INDvBAN | @hardikpandya7 | @IDFCFIRSTBank https://t.co/mvJvIuqm2B
— BCCI (@BCCI) October 6, 2024