ముంబై: స్వదేశంలో వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు బుమ్రా త్వరలో దక్షిణాఫ్రికాతో మొదలుకాబోయే వన్డే సిరీస్‌కు దూరం కానున్నట్టు సమాచారం. వర్క్‌లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా బుమ్రా.. వన్డేలకు దూరంగా ఉండనున్నాడు. కానీ పొట్టి సిరీస్‌కు అతడు పునరాగమనం చేయనున్నాడు. గాయపడి కోలుకుంటున్న హార్దిక్ మాత్రం రాబోయే మెగాటోర్నీ దృష్ట్యా దూరంగా ఉండనున్నట్లు తెలిసింది.