IPL 2024 : పదిహేడో సీజన్లో కెప్టెన్‌గా విఫలమవుతున్న హార్దిక్ పాండ్యా(Hardhik Pandya)కు మరో షాక్ తగిలింది. ఈసారి ఏకంగా రూ.24 లక్షల ఫైన్ పడింది. ఈ సీజన్లో పాండ్యాకు ఇది రెండో జరిమానా. లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants)తో మ్యాచ్‌లో ముంబై నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయలేకపోయింది.
దాంతో, మ్యాచ్ రిఫరీ ఫిర్యాదుతో కెప్టెన్ పాండ్యాపై బీసీసీఐ చర్యలు తీసుకుంది. అతడికి రూ.24 లక్షల ఫైన్ విధించింది. అంతేకాదు ఇంప్యాక్ట్ ప్లేయర్ల(Impact Player)తో సహా జట్టులోని ప్రతి ఒక్కరికి రూ. 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించింది. ఈ డబ్బు మొత్తాన్ని బీసీసీఐకి ముంబై ఫ్రాంచైజీ చెల్లించనుంది.
పొట్టి ఫార్మాట్లో టీమిండియాకు సిరీస్‌ల మీద సిరీస్‌లు అందించిన పాండ్యా పదిహేడో సీజన్లో మాత్రం మెప్పించలేకపోతున్నాడు. మినీ వేలానికి ముందు ముంబై పగ్గాలు అందుకున్న అతడు.. అభిమానులు, డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్ల మనుసు గెలచుకున్నా.. మైదానంలో మాత్రం మునపటిలా చెలరేగపోతున్నాడు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లోనే కాకుండా నాయకుడిగానూ జట్టుకు భరోసా ఇవ్వలేకపోతున్నాడు.
దాంతో, ఐదుసార్లు చాంపియన్‌గా అవరతరించిన ముంబై ఈసారి అట్టడుగున ఉంది. లక్నో సూపర్ జెయింట్స్‌పై దారుణ ఓటమితో ముంబై పరాజయాల సంఖ్య ఏడుకు చేరింది. 2024 ఎడిషన్‌లో ప్లే ఆఫ్స్ ఆశలు ఆవిరైన వేళ.. పాండ్యా సేన ఇక పరువు కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. తదుపరి మ్యాచ్‌లో మే 3న కోల్‌కతా నైట్‌రైడర్స్(Kolkata Knight Riders)తో ముంబై ఢీకొట్టనుంది.