Harbhajan Singh | జట్టు వైఫల్యానికి రోహిత్‌ను మాత్రమే నిందించడం సరికాదు : హర్భజన్
Harbhajan Singh : ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో(WTC Final 2023) భారత్ ఓటమితో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)పై విమర్శలు వెల్తువెత్తుతున్న విషయం తెలిసిందే. మాజీ క్రికెటర్లు సైతం అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ (Harbhajan Singh) రోహిత్‌కు బాసటగా నిలిచాడు. నిరుడు టీ20 ప్రపంచకప్...
Harbhajan Singh : ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో(WTC Final 2023) భారత్ ఓటమితో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)పై విమర్శలు వెల్తువెత్తుతున్న విషయం తెలిసిందే. మాజీ క్రికెటర్లు సైతం అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ (Harbhajan Singh) రోహిత్‌కు బాసటగా నిలిచాడు. నిరుడు టీ20 ప్రపంచకప్(T20 WC)లో ఓటమితో పాటు ఈ ఏడాది ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో(WTC Final 2023) భారత్ ఓటమికి కెప్టెన్ రోహిత్ శర్మదే ప్రధాన బాధ్యత అనే వాదనను హర్భజన్ తప్పుపట్టాడు.
క్రికెట్ అనేది జట్టు క్రీడ అని, జయాపజయాలకు ఏ ఒక్కరినో బాధ్యులను చేయడం సరికాదని భజ్జీ అన్నాడు. గతంలో ముంబై ఇండియన్స్(Mumbai Indians) తరఫున రోహిత్ శర్మతో కలిసి ఆడిన హర్భజన్.. తన పాత సారథికి అండగా నిలిచాడు. మూడు నెలల్లో స్వదేశంలో వన్డే ప్రపంచకప్(ODI WC 2023) జరుగనుండటంతో హిట్‌మ్యాన్‌కు మద్దతుగా నిలవాల్సిన అవసరముందని అతడు అభిప్రాయపడ్డాడు. స్వేచ్ఛ ఇచ్చినప్పుడు సారథి సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాడని ఈ వెటరన్ ఆఫ్ స్పిన్నర్ పేర్కొన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో కెప్టెన్ రోహిత్ శర్మ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్లే టీమిండియా పరాజయం పాలైందని లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) విమర్శించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గావస్కర్‌కు కౌంటర్‌గా భజ్జీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
రోహిత్.. అద్భుతమైన కెప్టెన్
‘సారథ్యం విషయంలో రోహిత్ శర్మ వైఖరిపై కొందరు అతిగా చేస్తున్నట్లు అనిపిస్తున్నది. క్రికెట్ అనేది టీమ్ గేమ్. ఏ ఒక్క ఆటగాడో జట్టును ఉన్నత శిఖరాలకు చేర్చలేదు. డబ్ల్యూటీసీ ఫైనల్లో(WTC Final 2023) భారత జట్టు రాణించలేకపోయిందనేది వాస్తవం. జట్టు వైఫల్యాన్ని విమర్శించడం సరైందే. కానీ ఒక్క రోహిత్‌నే తప్పు పట్టడం సమంజసం కాదు. ఓటమికి జట్టు మొత్తం బాధ్యత వహించాలి.
హర్భజన్ సింగ్, రోహిత్ శర్మ

రోహిత్ ఒక అద్భుతమైన కెప్టెన్ అనే విషయం మరిచిపోవద్దు. ఏదో ఒక్క మ్యాచ్‌లో రాణించలేకపోయినంత మాత్రాన అతడి గొప్పతనం తగ్గదు. ఇటీవలి ఫలితాల ఆధారంగా రోహిత్‌పై ఓ అంచనాకు రావడం తప్పు. అతడిపై విశ్వాసం ఉంచాల్సిన అవసరం ఉంది. బోర్డు నుంచి సహకారం లభిస్తే.. అతడు మరింత స్వేచ్ఛగా తన బాధ్యతలు నిర్వర్తిస్తాడు’ అని హర్భజన్ వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి
Lucknow Super Giants | కొత్త కోచ్ వేటలో లక్నో సూపర్ జెయింట్స్.. రేసులో ఆస్ట్రేలియా దిగ్గజం
MSK Prasad | కోహ్లీకి మళ్లీ టెస్టు పగ్గాలు అప్పగిస్తే తప్పేంటీ?.. మాజీ సెలెక్టర్ సంచలన కామెంట్స్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

