Lucknow Super Giants | కొత్త కోచ్ వేటలో లక్నో సూపర్ జెయింట్స్.. రేసులో ఆస్ట్రేలియా దిగ్గజం
Lucknow Super Giants : ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) కొత్త కోచ్ వేటలో పడింది. ప్రస్తుతం హెడ్ కోచ్‌గా ఉన్న ఆండీ ఫ్లవర్(Andy Flower) రెండేళ్ల కాంట్రాక్టు ముగియడమే అందుకు కారణం. అందుకని అనుభవజ్ఞుడైన కోచ్ కోసం లక్నో చూస్తోంది. తాజా సమాచారం మేరకు.. ఆస్ట్రేలియా దిగ్గజం...
Lucknow Super Giants : ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) కొత్త కోచ్ వేటలో పడింది. ప్రస్తుతం హెడ్ కోచ్‌గా ఉన్న ఆండీ ఫ్లవర్(Andy Flower) రెండేళ్ల కాంట్రాక్టు ముగియడమే అందుకు కారణం. అందుకని అనుభవజ్ఞుడైన కోచ్ కోసం లక్నో చూస్తోంది. తాజా సమాచారం మేరకు.. ఆస్ట్రేలియా దిగ్గజం జస్టిన్ లాంగర్(Justin Langer) హెడ్ కోచ్ రేసులో అందరికంటే ముందు ఉన్నాడు. లక్నో యాజయాన్యం అతడితో చర్చలు జరుపుతోంది. ఒకవేళ అన్నీ కుదిరితే వచ్చే సీజన్లో లాంగర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం ఖాయం.
అయితే.. లక్నో జట్టు మేనేజ్మెంట్ గానీ, లాంగర్ గానీ ఈ విషయంపై ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కంగారు జట్టుకు ఆడిన గొప్ప ఆటగాళ్లలో జస్టిన్ లాంగర్ ఒకడు. అతడి కెప్టెన్సీలో ఆస్ట్రేలియా 2021లో టీ20 వరల్డ్ కప్ చాంపియన్‌గా అవతరించింది. అంతేకాదు బిగ్‌బాష్ లీగ్(BigBash League)లోనూ లాంగర్ సారథిగా నిరూపించుకున్నాడు. పెర్త్ స్కార్చర్స్ టీమ్‌కు ట్రోఫీని అందించాడు.
రెండోసారి ప్లే ఆఫ్స్ వరకే
జింబాబ్వే మాజీ కెప్టెన్ ఆండీ ఫ్లవర్() పదహారో సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు హెడ్ కోచ్గావ్యవహరించాడు. గతంలో ఇంగ్లండ్‌కు కోచ్‌గా పనిచేసిన అతను జట్టు రాతను మార్చలేకపోయాడు. లక్నో జట్టు ఈసారి కూడా ప్లే ఆఫ్స్(Play Offs) దాటలేకపోయింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్(Mumbai Indians) చేతిలో చిత్తుగా ఓడింది.
లక్నో సూపర్ జెయింట్స్

ఈ సీజన్ లక్నోకు అంతగా కలిసి రాలేదని చెప్పాలి. ఎలాగంటే..? టోర్నీ మధ్యలో కెప్టెన్ కేఎల్ రాహుల్(KL Rahul) గాయపడడం ఆ జట్టుపై ప్రభావం చూపించింది. ఓపెనింగ్ జోడీ పెద్ద సమస్యగా మారింది. అయితే.. ఆ తర్వాత సారథిగా ఎన్నికైన ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా(Krunal Pandya) లక్నోను అద్భుతంగా నడిపించాడు. కానీ, కీలక మ్యాచుల్లో క్వింటన్ డికాక్, నికోలస్ పూరన్, స్టోయినిస్ విఫలమయ్యారు. దాంతో, లక్నో మరోసారి టైటిల్ వేటలో వెనకబడింది. అందుకని 17వ సీజన్లో అయినా టైటిల్ విజేత కావాలని అనుకుంటోంది. అందులో భాగంగానే కొత్త కోచ్ వేటను ప్రారంభించింది.
ఇవి కూడా చదవండి
MSK Prasad | కోహ్లీకి మళ్లీ టెస్టు పగ్గాలు అప్పగిస్తే తప్పేంటీ?.. మాజీ సెలెక్టర్ సంచలన కామెంట్స్
Ishant Sharma | టీమిండియా పేసర్ కొత్త అవతారం.. విండీస్ గడ్డపై కామెంటేటర్‌గా తొలి వ్యాఖ్యానం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

