HomeSportsHarbhajan Singh Anger Against Lalit Modi
ఆ వీడియో ఇప్పుడెందుకు?.. లలిత్ మోడీపై హర్భజన్ ఆగ్రహం
ఐపీఎల్లో 18 ఏండ్ల క్రితం భారత మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, శ్రీశాంత్ మధ్య జరిగిన ‘స్లాప్గేట్' వివాదానికి సంబంధించిన వీడియోను విడుదల చేసిన మాజీ చైర్మన్ లలిత్ మోడీపై భజ్జీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఢిల్లీ: ఐపీఎల్లో 18 ఏండ్ల క్రితం భారత మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, శ్రీశాంత్ మధ్య జరిగిన ‘స్లాప్గేట్’ వివాదానికి సంబంధించిన వీడియోను విడుదల చేసిన మాజీ చైర్మన్ లలిత్ మోడీపై భజ్జీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎప్పుడో ముగిసిపోయిన వివాదాన్ని మళ్లీ గుర్తుచేయడమెందుకని ప్రశ్నించాడు. ఈ మేరకు భజ్జీ మాట్లాడుతూ.. ‘ఆ వీడియోను విడుదల చేసిన విధానం తప్పు.
అప్పుడు అలా జరిగి ఉండాల్సింది కాదు. వీడియో రిలీజ్ చేయడం వెనుక వారి (లలిత్, క్లార్క్) స్వార్థపూరిత ఆలోచన ఉంది. 18 ఏండ్ల క్రితం జరిగి ప్రజలు మరిచిపోయిన వివాదాన్ని మళ్లీ గుర్తుచేయడం దేనికి? అప్పుడు జరిగిన దానికి నేను చాలా చింతిస్తున్నా. అలా చేసినందుకు చాలా బాధపడ్డా. దానిపై ఇప్పటికే నేను చాలాసార్లు క్షమాపణలు చెప్పా. తర్వాత మేం ఇద్దరం కలిసి కూడా ఆడాం.
తప్పులు మానవ సహజం. అందుకు నేనేమీ అతీతుడిని కాదు. ఈ వినాయక పూజల సందర్భంగా నేను మరోసారి క్షమాపణ కోరుతున్నా..’ అని అన్నాడు. కాగా లలిత్ మోడీ వీడియో విడుదల చేయడంపై శ్రీశాంత్ భార్య భువనేశ్వరి సైతం విమర్శలు గుప్పించిన విషయం విదితమే.