హనుమకొండ చౌరస్తా: హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. వరంగల్, హనుమకొండ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో 10వ తెలంగాణ స్టేట్ టోర్నీ పోటీలు నిర్వహిస్తున్నారు. బాలుర, బాలికల అండర్-8 నుంచి అండర్-20 వరకు వేర్వేరు విభాగాల్లో 1200 మంది ప్లేయర్లు పోటీపడుతున్నారు. తొలిరోజు గురువారం 100మీ, 400మీ, హైజంప్, లాంగ్‌జంప్, షార్ట్‌పుట్ పోటీలు నిర్వహించారు.
సింథటిక్ ట్రాక్‌పై ప్లేయర్లు చిరుతలను తలపిస్తూ పరిగెత్తారు. ఈ టోర్నీకి పారా ప్రపంచకప్ పసిడి విజేత జివాంజీ దీప్తి, నందిని, సాయిసంగీత ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హమనుకొండ అథ్లెటిక్స్ సంఘం అధ్యక్షుడు రాజేశ్వర్‌రావు, ఉపాధ్యక్షుడు చంద్రమౌళిగౌడ్, వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.