FIDE Women’s World Cup : జార్జియాలో జరుగుతున్న ఫిడే మహిళల వరల్డ్ కప్‌లో కోనేరు హంపి (Koneru Hampi) జోరు కొనసాగిస్తోంది. కఠినమైన ప్రత్యర్థులకు చెక్ పెడుతూ వస్తున్న భారత గ్రాండ్‌మాస్టర్ సెమీ ఫైనల్‌కు చేరువైంది. శనివారం జరిగిన క్వార్టర్స్ తొలి రౌండ్లో ఆమె చైనా ప్లేయర్ యుక్జిన్ సాంగ్‌ను ఓడించింది. తర్వాతి గేమ్‌ను డ్రా చేసుకున్నా చాలు హంపి సెమీస్ చేరడం ఖాయం. అయితే.. మహిళా బృందం మాత్రం నిరాశపరిచింది. ద్రోణవల్లి హారిక, దివ్యా దేశ్‌ముఖ్‌లు డ్రాతో సరిపెట్టుకున్నారు.
ఆరంభం నుంచి వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ యుక్జిన్ సాంగ్‌కు ముచ్చెమటలు పట్టించింది హంపి. తెల్ల పావులతో ఆడిన ఆమె తనమార్క్ ఆటతో యుక్జిన్ను తడబాటుకు గురి చేసింది. తన భటువును ఎరగా వేసి ప్రత్యర్థిని దెబ్బకొట్టింది. అయితే.. ఆ తర్వాత పుంజుకునేందుకు ప్రయత్నించిన యుక్కిజ్ గేమ్‌ను పసిగట్టిన హంపి ఆమె వ్యూహాలను సమర్ధంగా తిప్పి కొట్టింది. దాంతో, 53వ ఎత్తులో మ్యాచ్ ముగిసింది.
A historic moment in Indian Chess – 4 Indian players are through to the Quarterfinals of FIDE Women’s World Cup 2025!
GM @humpy_koneru, GM @HarikaDronavali, GM @chessvaishali and IM @DivyaDeshmukh05 – all four of them played the tiebreaks in the Pre-Quarterfinals, and all of… pic.twitter.com/o4uT5BFzDd
— ChessBase India (@ChessbaseIndia) July 18, 2025
మహిళా బృందంలోని దివ్య, హారికలు ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను డ్రాగా ముగించారు. రుయ్ లొపెజ్తో జరిగిన పోరులో నల్ల పావులతో ఆడిన దివ్య ఎలాంటి రిస్క్ తీసుకోలేదు. హారిక సైతం ఇదే వ్యూహాన్ని అనుసరించింది.