హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ జిమ్నాస్ట్ అనుపోజు కాంతిశ్రీ ప్రతిష్ఠాత్మక ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. 2013 నుంచి 2024 వరకు జరిగిన వివిధ జాతీయ, అంతర్జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ టోర్నీల్లో అత్యధిక పతకాలు(124) సాధించిన రికార్డును కాంతిశ్రీ సొంతం చేసుకుంది.
గత 11 ఏండ్ల వ్యవధిలో ఈ యువ జిమ్నాస్ట్ 75 స్వర్ణాలు సహా, 34 రజతాలు, 15 కాంస్య పతకాలు ఖాతాలో వేసుకుంది. లెక్కకు మిక్కిలి పతకాలు సాధించిన కాంతిశ్రీ భవిష్యత్‌లోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నది.