AFG vs PAK : ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలనే సామెత అఫ్గానిస్థాన్(Afghanistan) జట్టుకు చక్కగా సరిపోతుంది. అంతర్జాతీయ క్రికెట్(International Cricket)లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న అఫ్గాన్ టీమ్ పాకిస్థాన్(Pakistan)తో రెండో వన్డేలో దుమ్మురేపింది. చరిత్ర తిరగరాస్తూ రికార్డు స్కోరు నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో పాక్ బౌలర్ల చేతిలో చావుదెబ్బతిన్న అఫ్గాన్ బ్యాటర్లు ఈసారి విశ్వరూపం చూపించారు. దాంతో, ఈ సారి 5 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్ (151 బంతుల్లో 151; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ సెంచరీతో కదంతొక్కగా.. ఇబ్రహీం జద్రాన్ (80; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు.
తొలి వన్డేలో హరీస్ రవుఫ్ ఐదు వికెట్లతో అల్లాడించడంతో అఫ్గాన్ జట్టు 59 పరుగులకే ఆలౌటైంది. అయితే రెండో మ్యాచ్‌లో మాత్రం పూర్తి సాధికారతతో బ్యాటింగ్ చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గాన్ ఏమాత్రం తడబడలేదు. షాహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవుఫ్లను అలవోకగా ఎదుర్కొన్న ఓపెనర్లు రహ్మనుల్లా, ఇబ్రహీం తొల వికెట్‌కు రికార్డు స్థాయిలో 227 పరుగులు జోడించారు. పాక్ బౌలర్లు 39 ఓవర్ల వరకు ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారంటే వారెంత పట్టుదలతో ఆడారో అర్థం చేసుకోవచ్చు.
🎯 Set! 🙌
After opting to bat first, #AfghanAtalan, led by an incredible @RGurbaz_21 151, who was supported well by @IZadran18‘s 80, managed to put exactly 300 runs on the board in the 1st inning. 👏💪
Over to our bowlers…! 👍#AFGvPAK | #SuperColaCup | #ByaMaidanGato pic.twitter.com/Cu5flrQsCd
— Afghanistan Cricket Board (@ACBofficials) August 24, 2023
గత మ్యాచ్‌లోనే పాకిస్థాన్‌పై తమ అత్యల్ప స్కోరు (59 ఆలౌట్) నమోదు చేసుకున్న అప్ఘాన్.. ఈసారి పాక్‌పై తమ అత్యధిక స్కోరు (300/5) సాధించడం కొసమెరుపు. మరో వారం రోజుల్లో ఆసియా కప్ ప్రారంభం కానుండగా.. తమకు తిరుగులేదని విర్రవీగుతున్న పాక్ పేసర్లను అఫ్గాన్ నేలకు దింపింది. ప్రస్తుత తరంలో తమ బౌలింగ్‌ను మించింది లేదని పాకిస్థాన్ మాజీలు చెప్తున్న వ్యాఖ్యల్లో నిజం లేదని అఫ్గాన్ ఓపెనర్లు నిరూపించారు.