Asia Cup 2023 | సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు.. రాహుల్ ఎంపికపై మండిపడిన మాజీ ఓపెనర్
Asia Cup 2023 : ఆసియా కప్ స్క్వాడ్‌కు కేఎల్ రాహుల్(KL Rahul) ఎంపికపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఫిట్నెస్ నిరూపించుకోని ఆటగాడిని జాతీయ జట్టుకు ఎంపిక చేయాల్సిన అవసరం ఏముంది? అని మాజీ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్(krishanamachari srikanth) ఆగ్రహం వ్యక్తం చేశాడు. సెలెక్టర్ల తీరు తనకు ఏమాత్రం...
Asia Cup 2023 : ఆసియా కప్ స్క్వాడ్‌కు కేఎల్ రాహుల్(KL Rahul) ఎంపికపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఫిట్నెస్ నిరూపించుకోని ఆటగాడిని జాతీయ జట్టుకు ఎంపిక చేయాల్సిన అవసరం ఏముంది? అని మాజీ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్(krishanamachari srikanth) ఆగ్రహం వ్యక్తం చేశాడు. సెలెక్టర్ల తీరు తనకు ఏమాత్రం అర్థం కావడంలేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు.
‘రాహుల్ పూర్తిగా కోలుకోలేదు. అతడేదో నొప్పితో బాధపడుతున్నాడని చెబుతున్నారు. అలాంటప్పుడు అతడిని ఎందుకు ఎంపిక చేశారు. సెలెక్షన్ సమయంలో ఫిట్‌గా లేని ఆటగాడిని ఎంపిక చేయకూడదు. అదే మన విధానం కదా. ఆసియా కప్ ఆరంభంలో రాహుల్ కొన్ని మ్యాచ్‌లు ఆడలేడని చెబుతున్నారు. అందుకే శాంసన్‌ను రిజర్వ్ ఆటగాడిగా తీసుకున్నారు. ఇదంతా ఏంటో అర్థం కావడం లేదు. సెలెక్షన్ పాలసీ అంటూ లేనట్లు కనిపిస్తోంది’ అని శ్రీకాంత్ పేర్కొన్నాడు.
కేఎల్ రాహుల్

గత రెండు పర్యాయాలు ఆసియాకప్ ఫైనల్ చేరలేకపోయిన భారత జట్టు ఈసారి మెరుగైన ప్రదర్శన చేయాల్సింది పోయి ఇలా సెలెక్షన్ విషయంలోనే తడబడటం ఏంటో? అని కృష్ణమాచారి విచారం వ్యక్తం చేశాడు. రాహుల్ పూర్తిగా సిద్ధంగా లేడని, టోర్నీలో ఒకటి రెండు మ్యాచ్‌లు పూర్తయ్యేలోగా అతడు కోలుకుంటాడని సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్(Ajit Agarkar) అభిప్రాయపడ్డాడు. దాయాది పాకిస్థాన్‌తో పోరుకు అతడు అందుబాటులో ఉండకపోవచ్చని అగర్కార్ పేర్కొన్నాడు. మరి అలాంటి ఆటగాడిని జట్టులోకి ఎందుకు ఎంపిక చేయాల్సి వచ్చిందని శ్రీకాంత్ ప్రశ్నించాడు.
ఈ నెల 30 నుంచి ఆసియాకప్ ప్రారంభం కానుంది. అందుకని భారత సెలెక్షన్ కమిటీ ఇటీవలే జట్టను ప్రకటించింది. 17 మందితో కూడిన జట్టులో కేఎల్ రాహుల్‌కు చోటు దక్కింది. అయితే. అతడు పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించకపోవడంతో సంజూశాంసన్‌ను స్టాండ్‌బైగా ఎంపిక చేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

