వేడివేడి టీ, కాఫీలతో క్యాన్సర్
ఆవిర్లు కక్కుతున్న వేడివేడి టీ లేదా కాఫీని ఓ గుటక వేస్తే.. మనసుకు అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. అప్పటిదాకా ఉన్న అలసట ఇట్టే మాయమై పోతుంది. మెదడు ఉత్సాహంగా తయారవుతుంది. అయితే, ఈ ఆనందం వెనుక ఓ ఆరోగ్య ముప్పు కూడా దాగి ఉంది. చాలా వేడిగా ఉండే టీ లేదా కాఫీలను తాగే అలవాటు.. మన శరీరంలోని అత్యంత సున్నితమైన భాగాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రాణాంతకమైన అన్నవాహికలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తున్నది.
ఆవిర్లు కక్కుతున్న వేడివేడి టీ లేదా కాఫీని ఓ గుటక వేస్తే.. మనసుకు అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. అప్పటిదాకా ఉన్న అలసట ఇట్టే మాయమై పోతుంది. మెదడు ఉత్సాహంగా తయారవుతుంది. అయితే, ఈ ఆనందం వెనుక ఓ ఆరోగ్య ముప్పు కూడా దాగి ఉంది. చాలా వేడిగా ఉండే టీ లేదా కాఫీలను తాగే అలవాటు.. మన శరీరంలోని అత్యంత సున్నితమైన భాగాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రాణాంతకమైన అన్నవాహికలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తున్నది.
సాధారణంగా మానవ శరీరం సుమారు 60 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉండే ఉష్ణోగ్రతలను తట్టుకోగలదు. కానీ, ఇళ్లలో, హోటళ్లలో అందించే టీ, కాఫీలు 65 డిగ్రీల నుంచి 70 డిగ్రీల సెంటీగ్రేడ్, అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతతో ఉంటాయి. అంతటి వేడి పానీయాలు గొంతు కిందికి వెళ్లేటప్పుడు, అన్నవాహిక గోడలపై ఉండే సున్నితమైన మ్యూకోసా కణాలను దెబ్బతీస్తాయి. ఇలా ఒకసారితో ఆగిపోకుండా.. ప్రతిరోజూ వేడివేడిగా టీ, కాఫీలు తాగడం వల్ల అన్నవాహిక పొరలు నిరంతరం కాలిపోతూ, మళ్లీ మానుతూ ఉంటాయి.
ఈ పునరావృత గాయాల కారణంగా కణాల పునరుత్పత్తి జరిగేటప్పుడు జన్యుపరమైన లోపాలు ఏర్పడతాయి. ఇవే కాలక్రమేణా క్యాన్సర్ కణాలుగా రూపాంతరం చెందుతాయని పరిశోధకులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ సంస్థ.. ఈ అంశంపై విస్తృతమైన అధ్యయనం నిర్వహించింది. 65 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత కలిగిన పానీయాలను తీసుకోవడం వల్ల మనుషులలో అన్నవాహిక క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ఈ సంస్థ తేల్చింది. ఈ క్రమంలోనే అతి వేడిగా ఉండే పానీయాలను ‘గ్రూప్ 2ఏ కార్సినోజెన్స్’ జాబితాలో చేర్చింది. అంటే ఇవి మనుషుల్లో క్యాన్సర్‌ను కలిగించే అవకాశం ఉన్న పదార్థాల కోవలోకి వస్తాయి.
అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. టీ లేదా కాఫీలో క్యాన్సర్‌కు కారణమ్యే రసాయనాలు ఉన్నాయని కాదు. వాటిని చాలా వేడిగా తీసుకోవడమే అసలు సమస్య. దీనికి ఇతర ముప్పుకారకాలు కూడా తోడైతే.. ప్రమాదం రెట్టింపు అవుతుంది. చాలామంది వేడి టీ, కాఫీలు తాగుతూ.. ధూమపానం కూడా చేస్తుంటారు. ఇలాంటి వారిలో అన్నవాహిక క్యాన్సర్ బారిన పడే ముప్పు సాధారణ వ్యక్తుల కంటే అనేక రెట్లు ఎక్కువగా ఉంటుందట. వేడి వల్ల దెబ్బతిన్న కణాలపై ఆల్కహాల్, పొగాకు కణాలు మరింత తీవ్రమైన విష ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి, టీ లేదా కాఫీలను ఆవిర్లు కక్కుతున్నప్పుడే తాగేయొద్దు. కనీసం 5 నుంచి 10 నిమిషాలు పక్కన పెట్టి, గోరువెచ్చగా అయిన తర్వాతే తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

