Chess World Cup : మహిళల వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లతో క్రీడా వినోదాన్ని పంచుతున్న భారత్ ఈసారి మేధస్సుకు పదునుపెట్టే మెగా చెస్ టోర్నీకి వేదికవుతోంది. మరో నాలుగు రోజుల్లో ప్రతిష్ఠాత్మక చెస్ వరల్డ్ కప్ (Chess World Cup) పోటీలకు మనదేశం ఆతిథ్యమిస్తోంది. దాదాపు 23 ఏళ్ల తర్వాత ఇండియాలో జరుగనున్న ఈ మెగా టోర్నీకి గోవా వేదిక కానుంది. భారత బృందానికి గ్రాండ్‌మాస్టర్ డి.గుకేశ్ సారథ్యం వహించనున్నాడు. తనకు ఈ గౌరవం దక్కడం పట్ల ఈ వరల్డ్ ఛాంపియన్ సంతోషం వ్యక్తం చేశాడు.
చదరంగం ప్రపంచకప్ పోటీల కోసం ఆతృతగా చూస్తున్నా. భారత దేశంలో ఎక్కడ చెస్ ఆడినా గొప్పగా అనిపిస్తుంది. గోవాతో అయితే నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఇక్కడ నేను కొన్ని జూనియర్ ఈవెంట్స్‌లో కూడా పాల్గొన్నాను. ఈసారి వరల్డ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుండడం గొప్ప అనుభూతి ఇవ్వనుంది. అందుకే.. చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా అని గుకేశ్ వెల్లడించాడు. చివరిసారిగా గోవాలో అతడు 2019లో కేటగిరీ ఏ చెస్ పోటీలో పాల్గొన్నాడు. కానీ, అప్పుడు 10వ స్థానంలో నిరాశపరిచాడు.
🇮🇳 Gukesh D 🥹
Ladies and gentlemen, the 18th WORLD CHAMPION! #DingGukesh pic.twitter.com/CgzYBgeTfq— International Chess Federation (@FIDE_chess) December 12, 2024
చెస్ వరల్డ్ కప్‌లో 82 దేశాల నుంచి 206 మంది పోటీపడనున్నారు. ఎనిమిది రౌండ్లలో గెలుపొందిన వారు నాకౌట్‌కు అర్హత సాధిస్తారు. అయితే.. ఆనావాయితీ ప్రకారం టాప్ -50లో ఉన్న క్రీడాకారులు నేరుగా రెండో రౌండ్ ఆడుతారు. ప్రతి రౌండ్లో రెండు ఫార్మాట్లలో గేమ్ నిర్వహింనున్నారు. స్కోర్లు సమం అయినప్పుడు టై బ్రేకర్స్. విజేతకు రూ.17 కోట్ల ప్రైజ్‌మనీ దక్కనుంది.
4️⃣ days to go until the Chess World Cup 2025 ⏳
📆 31 October to 27 November 2025
📍 Goa, IndiaWho will walk out with the trophy? 👀 pic.twitter.com/zTbwKpwVTp
— ESPN India (@ESPNIndia) October 27, 2025
ఈ వరల్డ్ కప్‌లో అదరగొట్టిన వాళ్లు వచ్చే ఏడాది క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కు అర్హత సాధించే అవకాశముంది. సో.. గ్రాండ్‌మాస్టర్లంతా తమ మాస్టర్ గేమ్‌తో చెలరేగిపోయేందుకు సిద్దమవుతున్నారు. చివరగా 2002లో మనదేశంలో ఈ వరల్డ్ కప్ జరిగింది. ఆ ఏడాది హైదరాబాద్ వేదికగా సాగిన టోర్నీలో విశ్వనాథన్ ఆనంద్ (Viswanathan Anand) టైటిల్ గెలుపొందాడు. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 27 వరకూ చెస్ వరల్డ్ కప్ పోటీలు జరుగనున్నాయి.