GGW vs RCBW : మహిళల ప్రీమియర్ లీగ్‌లో మరో ఆసక్తికర పోరుకు వేళైంది. వరుసగా రెండు విజయాలతో దూసుకెళ్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు గుజరాత్ జెయింట్స్ సవాల్ విసురుతోంది. హ్యాట్రిక్‌పై కన్నేసిన ఆర్సీబీకి చెక్ పెట్టాలనుకుంటోంది గుజరాత్. గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో కంగుతిన్న ఆ జట్టు ఈసారి గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశమున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ సారథి అష్ గార్డ్నర్ బౌలింగ్ తీసుకుంది.
గుజరాత్ తుది జట్టు : బేత్ మూనీ(వికెట్ కీపర్), సోఫీ డెవినె, అష్లే గార్డ్నర్(కెప్టెన్), శివాని సింగ్, జార్జియా వరేహం, కనికా ఆహుజా, భారతి ఫుల్మాలి, కష్వీ గౌతమ్, తనూజ కన్వర్, రాజేశ్వరీ గైక్వాడ్, రేణుకా సింగ్.
ఆర్సీబీ తుది జట్టు : గ్రేస్ హ్యారిస్, స్మృతి మంధాన(కెప్టెన్), దయలాన్ హేమలత, గౌతమీ నాయక్, రీచా ఘోష్(వికెట్ కీపర్), రాధా యాదవ్, నడినే డీక్లెర్క్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, లిన్నే స్మిత్, లారెన్ బెల్.