లక్నో: ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. ఆదివారం డబుల్ హెడర్‌లో భాగంగా జరిగిన తొలి పోరులో గుజరాత్ 7 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌పై ఘన విజయం సాధించింది. లీగ్‌లో పడుతూ లేస్తూ సాగుతున్న లక్నోను వారి సొంత ఇలాఖాలోనే గుజరాత్ ఓటమి రుచిచూపించింది. తొలుత ప్రసిద్ధ్ కృష్ణ(4/28) ధాటికి లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 164/8 స్కోరుకు పరిమితమైంది. ఓపెనర్ మార్క్మ్(్ర30) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు.
ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన గుజరాత్ 18.4 ఓవర్లలో 165/3 స్కోరు చేసింది. బట్లర్(37 బంతుల్లో 60, 11ఫోర్లు), కెప్టెన్ శుభ్‌మన్ గిల్(40 బంతుల్లో 56, 6ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీలతో జట్టు విజయంలో కీలకమయ్యారు. గుజరాత్ బౌలర్లు ప్రభావం చూపించిన చోట లక్నో బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. సొంత ఇలాఖాలో తొలుత బ్యాటింగ్ చేస్తూ వరుసగా ఆరోసారి లక్నో ఓటమిపాలైంది. ప్రసిద్ధ్ కృష్ణకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
టాస్ గెలిచిన గుజరాత్..లక్నోను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న మిచెల్ మార్ష్(11) మరోమారు నిరాశపరిచాడు. రబాడ బౌలింగ్‌లో సిక్స్‌తో దూకుడు కనబరిచిన మార్ష్ భారీ షాట్ ఆడే క్రమంలో గిల్ చేతికి చిక్కాడు. దీంతో 14 పరుగులకే లక్నో తొలి వికెట్ కోల్పోయింది. ఫస్ట్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ రిషబ్ పంత్(18) ఎక్కువసేపు క్రీజులో నిలదొక్కుకోలేకపోయాడు. పంత్‌ను అనుసరిస్తూ ప్రసిద్ధ్ బౌలింగ్‌లో మార్క్మ్ కూడా పెవిలియన్ చేరడంతో లక్నో 69 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది.
ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ఆయూష్ బదోని(9), నికోలస్ పూరన్(19), సమద్(18), ముకుల్ చౌదరి(18) స్వల్ప స్కోర్లకు పరిమితమయ్యారు. తనదైన పేస్‌తో మార్క్మ్‌న్రు ఔట్ చేసిన ప్రసిద్ధ్..బదోని, పూరన్, ముకుల్‌ను ఔట్ చేసి లక్నోను కోలుకోలేని దెబ్బకొట్టాడు. బంతిని ఇరువైపులా స్వింగ్ చేస్తూ లక్నో బ్యాటర్లకు మూకుతాడు వేశాడు. ఈ క్రమంలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన లక్నో స్వల్ప స్కోరుకు పరిమితమైంది.
అశోక్(2/32)కు రెండు వికెట్లు దక్కాయి.
బట్లర్, గిల్ బాదుడు: నిర్దేశిత లక్ష్యఛేదనలో గుజరాత్‌కు మెరుగైన శుభారంభం దక్కలేదు. ఫామ్‌మీదున్న ఓపెనర్ సాయిసుదర్శన్(15) ఈసారి బ్యాటు ఝులిపించడంలో విఫలం కాగా, కెప్టెన్ గిల్ ఆ బాధ్యతను భుజానేసుకున్నాడు. 45 పరుగులకు సుదర్శన్ వికెట్ కోల్పోయిన టైటాన్స్..గిల్, బట్లర్ బ్యాటింగ్‌తో లక్ష్యం వైపు సాఫీగా సాగింది. దిగ్వేశ్ రాఠి ఎనిమిదో ఓవర్లో బట్లర్ క్యాచ్‌ను పంత్ విడిచిపెట్టగా వచ్చిన అవకాశాన్ని చక్కగా వాడుకున్నాడు.
ఇక్కణ్నుంచి లక్నో బౌలర్లకు ఏమాత్రం చాన్స్ ఇవ్వని గిల్, బట్లర్ బౌండరీలతో విరుచుకుపడ్డారు. వీరిని విడదీసేందుకు పంత్ ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో గిల్ ఔట్ కావడంతో రెండో వికెట్‌కు 84 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. గిల్‌ను అనుసరిస్తూ ఆరు పరుగుల తేడాతో బట్లర్ ఔటైనా..సుందర్(21 నాటౌట్), తెవాటియా(10 నాటౌట్) మరో వికెట్ పడకుండా టైటాన్స్‌ను గెలుపు తీరాలకు చేర్చారు.
లక్నో: 20 ఓవర్లలో 164/8(మార్క్మ్ 30, పూరన్ 19, ప్రసిద్ధ్ 4/28, అశోక్ 2/32),
గుజరాత్: 18.4 ఓవర్లలో 165/3(బట్లర్ 60, గిల్ 56, ప్రిన్స్ 1/31, దిగ్వేశ్ 1/31)