న్యూఢిల్లీ: గుజరాత్ టైటాన్స్ స్టార్ బౌలర్ కగిసో రబాడ స్వదేశం దక్షిణాఫ్రికాకు బయల్దేరి వెళ్లాడు. వ్యక్తిగత కారణాలతో అతను వెళ్లినట్లు గుజరాత్ టైటాన్స్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ అత్యవసర ప్రయాణానికి గల కారణాలు ఏంటో ఫ్రాంచైజీ వెల్లడించలేదు.
బుధవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో మ్యాచ్లోనూ రబాడను తుది జట్టులోకి తీసుకోలేదు. రబాడ స్థానంలో యువ బౌలర్ అర్షద్ఖాన్కు అవకాశం కల్పించారు.