IPL 2025 : మాజీ చాంపియన గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) 18వ సీజన్లో టైటిల్ లక్ష్యంగా సిద్ధమవుతోంది. యువకెరటం శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని జట్టును గాడిన పెట్టేందుకు యాజమాన్యం కొత్త బ్యాటింగ్ కోచ్‌ను నియమించింది. మీడియాలో వస్తున్న కథనాలను నిజం చేస్తూ భారత జట్టు మాజీ వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ (Parthiv Patel)కు అసిస్టెంట్, బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు అప్పగించింది.
ఐపీఎల్లో ఆటగాడిగా, ఆపై టాలెంట్ స్కౌట్‌గా ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టుకు సేవలందించిన పార్థీవ్ ఇక గుజరాత్ బ్యాటింగ్ యూనిట్‌ను చక్కదిద్దనున్నాడు. ‘భారత జట్టు వికెట్ కీపర్‌గా, బ్యాటర్‌గా పార్థీవ్ పటేల్‌కు 17 ఏండ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. అతడి అనుభవం, తెలివితేటలను జట్టుకు ఎంతో ఉపయోగపడతాయి అని పార్థీవ్ పటేల్ నియామకాన్ని ఖరారు చేస్తూ గుజరాత్ ఫ్రాంచైజీ ఎక్స్‌లో అధికారికంగా పోస్ట్ పెట్టింది.
Aapdo Gujju chhokro Parthiv Patel joins Gujarat Titans as Assistant and Batting Coach! 🏏🤩#AavaDe | @parthiv9 pic.twitter.com/HFWvgqJR8t
— Gujarat Titans (@gujarat_titans) November 13, 2024
గుజరాత్ టైటాన్స్ 18వ సీజన్‌కు సన్నద్ధం అవుతున్న వేళ పార్థీవ్ పటేల్ అనుభవం ఆ జట్టుకు ఎంతో ఉపకరించనుంది. పరిస్థితులను వేగంగా అర్ధం చేసుకోగల పార్థీవ్.. యువక్రికెటర్లకు మార్గనిర్దేశనం చేయగలడు. అతడి రాకతో గుజరాత్ కోచింగ్ సిబ్బంది బలంగా మారనుంది అని గుజరాత్ వెల్లడించింది. పాలబుగ్గల పార్థీవ్కు భారత పిచ్‌లపై చక్కని అవగాహన ఉంది. అతడు 2018లో చివరిసారిగా ఐపీఎల్ ఆడాడు. ఆపై బ్యాటింగ్ కన్సల్టెంట్, కోచ్, టాలెంట్ స్కౌట్.. ఇలా పలు బాధ్యతలు నిర్వర్తించాడు.
ఐపీఎల్ అరంగేట్రంలోనే కప్ కొట్టిన గుజరాత్ మరుసటి ఏడాదీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలిసారి కప్ అందించిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardhik Pandya) మరోసారి తన మ్యాజిక్ చేసినా జట్టుకు ట్రోఫీ మాత్రం దక్కలేదు. అంతలోనే ముంబై ఇండియన్స్ అతడిని కొనేసి.. కెప్టెన్సీ అప్పగించింది. ఆ పరిస్థితుల్లో గుజరాత్‌కు యువకెరటం శుభ్‌మన్ గిల్ పెద్ద దిక్కయ్యాడు.
Yeh tough choice ab tum pe! 😅#AavaDe pic.twitter.com/XIKgTZU0kX
— Gujarat Titans (@gujarat_titans) November 11, 2024
కెప్టెన్‌గా అనుభవం లేని గిల్ సారథ్యంలో గుజరాత్ 17వ సీజన్లో ఆశించిన స్థాయిలో ఆడలేదు. సీనియర్ పేసర్ మహ్మద్ షమీ లేకపోవడం.. ప్రధాన ఆటగాళ్లు సాహా, మిల్లర్, విజయ్ శంకర్లు విఫలమవ్వడం.. కెప్టెన్‌గా గిల్‌పై భారం పడడం.. ఇవన్నీ కలిసి గుజరాత్ ప్లే ఆఫ్స్ అవకాశాల్ని దెబ్బ తీశాయి. దాంతో, 18 వ సీజన్లో ట్రోఫీ లక్ష్యంగా గుజరాత్ వ్యూహాలు రచిస్తోంది. అందుకు తగ్గట్టే కోచింగ్ టీమ్‌ను బలోపేతం చేసుకుంటోంది.