వడోదరా: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో గుజరాత్ గెలుపు బాట పట్టింది. గురువారం యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 45 పరుగుల తేడాతో యూపీపై ఘన విజయం సాధించింది. వరుసగా హ్యాట్రిక్ ఓటములతో ఢీలా పడ్డ గుజరాత్ సొంత ఇలాఖాలో అదరగొట్టింది. గుజరాత్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యఛేదనలో యూపీ 17.3 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది.
రాజేశ్వరి(3/16), డివైన్(2/16), రేణుకాసింగ్(2/20) ధాటికి యూపీ కుప్పకూలింది. ట్రయాన్ (30) మినహా అందరూ విఫలమయ్యారు. తొలుత డివైన్(50 నాటౌట్) అర్ధసెంచరీతో గుజరాత్ 20 ఓవర్లలో 153/8 స్కోరు చేసింది. క్రాంతిగౌడ్(2/18), ఎకల్‌స్టోన్(2/22) రెండేసి వికెట్లు తీశాడు.