తన మాజీ టీం ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ సారధి హార్దిక్ పాండ్యా టాస్ గెలిచాడు. గత మ్యాచ్‌లో టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ ఎంచుకొని ఘోరంగా దెబ్బతిన్న గుజరాత్.. ఈసారి అలాంటి నిర్ణయం తీసుకోలేదు.
టాస్ గెలిచిన వెంటనే బౌలింగ్ చేస్తామని చెప్పాడు. తమ జట్టులో ఎలాంటి మార్పులూ లేవని వెల్లడించాడు. అదే సమయంలో తమ జట్టులో ఒక మార్పు ఉందని ముంబై సారధి రోహిత్ శర్మ తెలిపాడు. హృతిక్ షోకీన్ స్థానంలో మురుగన్ అశ్విన్ ఆడుతున్నాడని చెప్పాడు.
గుజరాత్ టైటన్స్: వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ప్రదీప్ సంగ్వాన్, లోకీ ఫెర్గూసన్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ షమీ
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, టిమ్ డేవిడ్, డానియల్ శామ్స్, మురుగన్ అశ్విన్, కుమార్ కార్తికేయ, జస్ప్రీత్ బుమ్రా, రైలీ మెరెడిత్
🚨 Toss Update 🚨@gujarat_titans have elected to bowl against @mipaltan.
Follow the match ▶️ https://t.co/2bqbwTHMRS #TATAIPL | #GTvMI pic.twitter.com/Euqi2ym9Ce
— IndianPremierLeague (@IPL) May 6, 2022
🚨 Team News 🚨@gujarat_titans remain unchanged.
1⃣ change for @mipaltan as M Ashwin is named in the team.
Follow the match ▶️ https://t.co/2bqbwTHMRS #TATAIPL | #GTvMI
A look at the Playing XIs 🔽 pic.twitter.com/Bi6um60BJJ
— IndianPremierLeague (@IPL) May 6, 2022