Vending machine | రైల్వే స్టేషన్లలో న్యూస్ పేపర్ వెండింగ్ మిషన్లు..!
Vending machine | తమిళనాడు (Tamil Nadu) రాజధాని చెన్నై (Chennai) లోని రైల్వే స్టేషన్ల (Railway stations) లో వార్తా పత్రికల కోసం ప్రత్యేకంగా వెండింగ్ యంత్రాల (Vending machines) ను ప్రవేశపెట్టాలని దక్షిణ రైల్వే (South railway) చెన్నై డివిజన్ (Chennai division) యోచిస్తోంది.
Vending machine : తమిళనాడు (Tamil Nadu) రాజధాని చెన్నై (Chennai) లోని రైల్వే స్టేషన్ల (Railway stations) లో వార్తా పత్రికల కోసం ప్రత్యేకంగా వెండింగ్ యంత్రాల (Vending machines) ను ప్రవేశపెట్టాలని దక్షిణ రైల్వే (South railway) చెన్నై డివిజన్ (Chennai division) యోచిస్తోంది. అన్ని భాషల ప్రధాన వార్తా పత్రికలు యంత్రంలో అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది. క్రోంపేట, పెరంబూరు, చెంగల్పట్టు, కాట్పాడి, జోలార్పేట్టై వంటి 12 స్టేషన్లలో వెండింగ్ మెషిన్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
కాగా గత అక్టోబర్‌లో ప్రారంభించిన బుక్ వెండింగ్ యంత్రాల ద్వారా చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో 800, తాంబరం రైల్వే స్టేషన్లో 750 పుస్తకాల విక్రయాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. వెండింగ్ యంత్రాల ద్వారా పాఠకులు తమకు కావాల్సిన పత్రికను ఎంచుకునే వీలుందని చెప్పారు. డిజిటల్ మాధ్యమంలో వార్తా పత్రికలు అందుబాటులో ఉన్నా చేతిలోకి తీసుకుని చదవడం ద్వారా భిన్నమైన అనుభూతి పొందగలమని చెన్నైకి చెందిన పలువురు ప్రయాణికులు చెబుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

