RAzor | డిఫరెంట్ కాన్సెప్ట్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు రవిబాబు తన తదుపరి సినిమాను అధికారికంగా ప్రకటించారు. పూర్తిగా డైలాగ్‌లేని, భీకరమైన విజువల్స్‌తో కూడిన గ్లింప్స్‌ను విడుదల చేస్తూ, తన కొత్త సినిమా టైటిల్‌ను ‘రేజర్’ గా వెల్లడించారు. 45 సెకన్ల నిడివి ఉన్న ఈ గ్లింప్స్ పూర్తిగా థ్రిల్లర్ టోన్‌లో సాగింది. చేతులను నరికేయడం, శరీరాన్ని రెండు ముక్కలుగా కోయడం, కత్తితో తల నరికే సన్నివేశాలు చూపిస్తూ, ఒక్క మాట కూడా లేకుండా ప్రేక్షకులను షాక్‌కు గురిచేసింది. విజువల్స్ ఆధారంగా కథా భావనను తెలియజేయడం ఈ గ్లింప్స్ ప్రత్యేకతగా నిలిచింది.
ఈ గ్లింప్స్‌లో రవిబాబు తప్ప మరే ఇతర ప్రముఖ నటులు కనిపించలేదు లేదా ప్రకటించడం చేయలేదు. అయితే, చూపించిన సన్నివేశాలు మాత్రం థ్రిల్లర్ సినిమాల అభిమానులను వెంటనే ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా డార్క్, వైలెంట్ థ్రిల్లర్ జానర్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా గట్టిగా కనెక్ట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది.ఈ చిత్రాన్ని ఫ్లయింగ్ ఫ్రాగ్స్ మరియు సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ రెండు బ్యానర్లు మరోసారి కలిసి పనిచేస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ‘రేజర్’ సినిమాను సమ్మర్ 2026లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఇప్పటికే గ్లింప్స్‌తోనే హాట్ టాపిక్‌గా మారిన ‘రేజర్’పై మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. మరోసారి తన డిఫరెంట్ టేక్‌తో రవిబాబు ప్రేక్షకులను షాక్‌కు గురిచేస్తాడా అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. ఇప్పటివరకు డిఫరెంట్ కాన్సెప్ట్స్, వినూత్న కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రవిబాబు, ఈసారి కూడా అదే స్థాయిలో ఒక కొత్త క్రైమ్ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. గతంలో రవిబాబు అల్లరి, అనసూయ, నచ్చావులే, నువ్విలా, అమరావతి, అవును, ఆవిరి, క్రష్.. లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో ప్రేక్షకులని అలరించిన విషయం తెలిసిందే